Revanth Reddy : జంట నగరాలపై అణుబాంబే, హైదరాబాద్‌లో వేలాది మంది చనిపోయే పరిస్థితి వస్తుంది..! రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy : హిరోషిమా, నాగసాకి లా హైదరాబాద్‌ని తయారు చేస్తున్నారు. కేసీఆర్ నిర్ణయంతో హైదరాబాద్ నగరం వరదల్లో మునిగి వేలమంది చనిపోయే..

Revanth Reddy : జంట నగరాలపై అణుబాంబే, హైదరాబాద్‌లో వేలాది మంది చనిపోయే పరిస్థితి వస్తుంది..! రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy

Updated On : May 22, 2023 / 5:34 PM IST

Revanth Reddy – 111 GO : 111 జీవో రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దుమారం రేపుతోంది. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. సీఎం కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. 111 జీవో రద్దు వెనుక లక్షల కోట్ల స్కామ్ ఉందని కాంగ్రెస్, బీజేపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 111 జీవో రద్దు నిర్ణయాన్ని అణువిస్పోటనంతో అభివర్ణించారు. ఈ నిర్ణయంతో జంట నగరాలపై అణుబాంబు వేసినట్లే అని ఆయన అన్నారు.

హైదరాబాద్ గాంధీభవన్ లో రేవంత్ రెడ్డి మాట్లాడారు. 111 జీవో రద్దుపై తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ టార్గెట్ గా నిప్పులు చెరిగారు. 111 జీవో రద్దు వెనక లక్షల కోట్ల స్కామ్ ఉందని ఆయన ఆరోపించారు. తెలంగాణలో బినామీ యాక్ట్ పర్ఫెక్ట్ గా అమలవుతోందన్నారు. కేసీఆర్ దోపిడీలో వాటా లేకపోతే.. కేసీఆర్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో బండి సంజయ్, కిషన్ రెడ్డిలు చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ రంకెలెయ్యడం కాదు.. 111 జీవో రద్దుపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయాలన్నారు. 111జీవో రద్దుపై కాంగ్రెస్ పార్టీ తరపున నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు రేవంత్ రెడ్డి.(Revanth Reddy)

” కేసీఆర్ నిర్ణయం వల్ల హైదరాబాద్ నగరం వరదల్లో మునిగి వేలమంది చనిపోయే పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఇప్పటివరకు భూ కేటాయింపులు జరగలేదు. మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం భూమి కేటాయించాం. 5100 గజాల కోసం పైసలు కట్టాం. కానీ భూకేటాయింపు జరగలేదు. అందుకే ఇప్పటికీ కిరాయికి ఉంటున్నాం. కేసీఆర్ తన పార్టీ ఆఫీసుకి 11 ఎకరాలు కేటాయించుకోడం దుర్మార్గం. మా కార్యాలయానికి స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం.

Also Read..Bandi Sanjay : 111 జీవో ఎత్తివేత వెనుక లక్షల కోట్ల స్కామ్, కారు చౌకగా కొట్టేసేందుకు ప్లాన్- బండి సంజయ్ సంచలన ఆరోపణలు

111 జీవో పరిధిలో టీఆర్ఎస్ వాళ్ళు వందలాది ఎకరాల కొన్నారు. 111 జీవో ప్రాంతంది తాగునీటి సమస్య కానేకాదు. బ్రిటీష్ రాజులు, నిజాం ప్రభువులు, సమైక్య పాలకులు హైదరాబాద్ ని డెవలప్ చేస్తూ వచ్చారు. దుర్మార్గులైన బ్రిటీష్, నిజాం, సమైక్య పాలకులకన్నా కేసీఆర్ దుర్మార్గంగా పాలిస్తున్నారు. పరిపాలనపై పట్టులేని వ్యక్తి నిర్ణయాల వల్ల హైదరాబాద్ ఆగం అవుతోంది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక హైదరబాద్ విధ్వంసం మొదలైంది. కేటీఆర్ రియల్ ఎస్టేట్ మాఫియాను తయారు చేసుకున్నారు.

Also Read..Nizamabad Rural Constituency: బాజిరెడ్డి ఈసారి ఎన్నికల బరిలో నిలుస్తారా.. నిజామాబాద్ రూరల్‌లో ఇంట్రస్టింగ్ పాలిటిక్స్?

111 జీవో రద్దు అణువిస్పోటనం లాంటిది. హిరోషిమా, నాగసాకి లాగా హైదరాబాద్ ని తయారు చేస్తున్నారు. 111 జీవో రద్దు వెనక ధనదాహం, అవినీతి, దోపిడీ ఉన్నాయి. 111 జీవో పరిధిలోని 80శాతం భూములు కేసీఆర్ బినామీల చేతుల్లో ఉన్నాయి. పైపుల కంపెనీ కోసం 111 జీవో రద్దు చేస్తున్నారు. 111 జీవో రద్దు వెనక లక్షల కోట్ల స్కాం ఉంది.(Revanth Reddy)

111జీవో రద్దు ముమ్మాటికీ విధ్వంసమే. సోమేష్ కుమార్, అరవింద్ కుమార్ ఈ విధ్వంసానికి కారణం. ఆరవింద్ కుమార్, సోమేష్ కుమార్, కేసీఆర్, కేటీఆర్ లని అమరవీరుల స్థూపం దగ్గర కట్టేయాలి. హైదరాబాద్ లో చెరువులన్నీ మాయం అయ్యాయి. నీళ్ళు ఉన్న దగ్గరికి వెళ్ళి ఇల్లు కడుతున్నారు” అని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.