వైఎస్ వివేకా మృతి : సమగ్ర విచారణకు సిట్

  • Published By: veegamteam ,Published On : March 15, 2019 / 08:31 AM IST
వైఎస్ వివేకా మృతి : సమగ్ర విచారణకు సిట్

మాజీ మంత్రి, జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి మృతి సంచలనంగా మారింది. ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వివేకానందరెడ్డి మృతి ఘటన రాజకీయ రంగు పులుముకుంది. దీనిపై సీఎం చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అత్యున్నత స్థాయి దర్యాఫ్తు చేయాలని పోలీసులను ఆదేశించారు. సమగ్ర విచారణ జరిపించాలన్నారు.

దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో వివేకా మృతిపై అదనపు ఎస్పీ బి.లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేశారు. అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తామని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ వర్మ చెప్పారు. వివేకా మృతిపై సీఆర్పీసీ 174 ప్రకరాం కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు ఎస్పీ తెలిపారు.
Read Also: కత్తితో నరికారు : వివేకానందరెడ్డిని చంపేశారు

వివేకానందరెడ్డి మరణంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వివేక కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లయింట్ చేశారు. పోస్టుమార్టంలో ఐదు అనుమానాలకు క్లారిటీ ఇవ్వాలని పోలీసులు.. డాక్టర్లను కోరారు. విచారణ నిష్పక్షపాతికంగా జరగాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పోలీసులను కోరారు. 2019, మార్చి 15 తేదీ శుక్రవారం పులివెందులలోని నివాసంలోని బాత్రూంలో వైఎస్ వివేక రక్తపు మడుగులో పడి ఉన్నారు. గుండెపోటుతో చనిపోయారని మొదట వార్తలు వచ్చినా.. ఆ తర్వాత శరీరంపై ఉన్న గాయాలతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అనుమానం ఒకటి : బాత్ రూంలో రక్తపు మడుగులో పడి ఉండడం
అనుమానం రెండు : బెడ్ రూం దగ్గర రెండు లీటర్ల రక్తం
అనుమానం మూడు : తలపై గాయం ఉండడం
అనుమానం నాలుగు : తల వెనక భాగంలోనూ గాయం
అనుమానం ఐదు :  అరచేతిపై బలమైన గాయం ఉంది.

ఈ 5 అనుమానాలను వ్యక్తం చేస్తూ పోలీసులకు కుటుంబ సభ్యులు కంప్లయింట్ చేశారు. పోస్టుమార్టం అనంతరం వైఎస్ వివేకానందరెడ్డి ఎలా మృతి చెందారు అనే దానిపై క్లారిటీ వస్తుంది.
Read Also: వైఎస్ వివేకా మృతి : అభ్యర్థుల ప్రకటన వాయిదా