Sonia Gandhi: ఢిల్లీలోని గంగారం ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ
జూన్ నెలలో సైతం ఇదే ఆసుపత్రిలో సోనియా చేరారు. ఆ సమయంలో ఆమెకు కొవిడ్ సోకడంతో ఇక్కడే చికిత్స తీసుకున్నారు. జూన్ 12న ఆసుపత్రిలో చేరగా, జూన్ 18న డిశ్చార్జీ అయ్యారు. ఆ తర్వాత కూడా కోవిడ్ అనంతరం సమస్యలతో చెకప్‌లు చేయించుకున్నారు. కొద్ది నెలల క్రితమే ఆమె వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లారు.

Sonia Gandhi admitted to Delhi’s Ganga Ram hospital
Sonia Gandhi: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మంగళవారం ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరారు. రొటీన్ చెకప్‌లలో భాగంగా ఆమె ఆసుపత్రిలో చేరినట్టు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. సోనియా ఆరోగ్యం పరిశీలిస్తున్న డాక్టర్ అజయ్ స్వరూప్ తెలిపిన వివరాల ప్రకారం.. చాతి సంబంధిత విభాగంలో సోనియా గాంధీ చేరారని, తనతో పాటు తన బృందం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని అజయ్ స్వరూప్ తెలిపారు.
Karnataka : ప్రధాని మోడీ ముందు సీఎం బసవరాజ్ బొమ్మై కుక్కపిల్లలా వణుకుతారు : సిద్ధరామయ్య
జూన్ నెలలో సైతం ఇదే ఆసుపత్రిలో సోనియా చేరారు. ఆ సమయంలో ఆమెకు కొవిడ్ సోకడంతో ఇక్కడే చికిత్స తీసుకున్నారు. జూన్ 12న ఆసుపత్రిలో చేరగా, జూన్ 18న డిశ్చార్జీ అయ్యారు. ఆ తర్వాత కూడా కోవిడ్ అనంతరం సమస్యలతో చెకప్‌లు చేయించుకున్నారు. కొద్ది నెలల క్రితమే ఆమె వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లారు. ఇటీవల కర్ణాటక, ఢిల్లీలో భారత్ జోడో యాత్ర ప్రవేశించినప్పుడు రాహుల్ గాంధీతో కలిసి కొద్దిసేపు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ తర్వాత నుంచి ఆరోగ్య పరీక్షలు తరుచూ చేసుకుంటున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.