Mahasena Rajesh : అవసరమైతే పోటీ నుంచి తప్పుకుంటా..! టీడీపీ అభ్యర్థి మహాసేన రాజేశ్ కీలక వ్యాఖ్యలు

ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఫస్ట్ గెలిచే నియోజకవర్గం పి.గన్నవరం.

Mahasena Rajesh : అవసరమైతే పోటీ నుంచి తప్పుకుంటా..! టీడీపీ అభ్యర్థి మహాసేన రాజేశ్ కీలక వ్యాఖ్యలు

Mahasena Rajesh Key Comments On Contest

Updated On : March 2, 2024 / 11:12 PM IST

Mahasena Rajesh : అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం టీడీపీ అభ్యర్థి మహాసేన రాజేశ్ కీలక కామెంట్స్ చేశారు. పార్టీకి గానీ, పార్టీ పెద్దలకు కానీ చిన్న ఇబ్బంది కలిగినా స్వచ్చందంగా తాను పోటీ నుంచి తప్పుకుంటానని తెలిపారు. రాష్ట్రంలో మొదట గెలిచే సీటు పి.గన్నవరం అవుతుందన్నారు. తాను పోటీలో ఉండటం కంటే పార్టీ గెలుపే ముఖ్యం అని రాజేశ్ తెలిపారు.

”ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పి.గన్నవరం నియోజకవర్గానికి నేనే ఇంఛార్జ్. ఇప్పటికీ పి.గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థిని నేనే. అన్ని సర్వేల్లో 142 సీట్లకు తగ్గకుండా టీడీపీ-జనసేన కూటమి గెలుస్తుందని వస్తోంది. ఈ సమయంలో నాలోంటోడి వల్ల చిన్న బ్యాడ్ వచ్చి ఆ సీట్లలో కొంచెం తగ్గినా ఆ బ్లేమ్ నేను మోయాల్సి వస్తుంది. నేను పార్టీకి బలం అవ్వాలి తప్ప నా వల్ల పార్టీ బలహీనపడకూడదు.

పార్టీకి కనుక నా వల్ల ఏదైనా నష్టం జరుగుతుంది అని అనుకుంటే స్వచ్చందంగా తప్పుకోవడానికి ఇప్పటికి కూడా నేను సిద్ధంగానే ఉన్నా. ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఫస్ట్ గెలిచే నియోజకవర్గం పి.గన్నవరం. ఎమ్మెల్యే అభ్యర్థిగా పి.గన్నవరంలో టీడీపీ-జనసేన జెండా ఎగరేసి మేము బహుమతిగా ఇస్తాం” అని మహాసేన రాజేశ్ అన్నారు.

Also Read : వైసీపీలోకి ముద్రగడ..? పిఠాపురంలో శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు