టీడీపీకి మరో ఎదురుదెబ్బ : వైసీపీలోకి మాగుంట

ఏపీలో అధికార టీడీపీకి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీకి రాజీనామా చేయనున్నారు. మార్చి 15 శుక్రవారం జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో

  • Published By: veegamteam ,Published On : March 14, 2019 / 09:45 AM IST
టీడీపీకి మరో ఎదురుదెబ్బ : వైసీపీలోకి మాగుంట

ఏపీలో అధికార టీడీపీకి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీకి రాజీనామా చేయనున్నారు. మార్చి 15 శుక్రవారం జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో

ఏపీలో అధికార టీడీపీకి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీకి రాజీనామా చేయనున్నారు. మార్చి 15 శుక్రవారం జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరనున్నారు. ఒంగోలు వైసీపీ అభ్యర్థిగా మాగుంటను జగన్ ఫైనల్ చేసినట్లు సమాచారం. దీంతో మాగుంట టీడీపీని వీడాలని డిసైడ్ అయ్యారు.   
Read Also : యుద్ధానికి సేనాని సిద్ధం : పవన్ కళ్యాణ్ సమర శంఖం 

మాగుంట రాజీనామా ఎపిసోడ్ వ్యవహారం నెల రోజులుగా నడుస్తోంది. ఒంగోలు ఎంపీగా పోటీ చేయాలని మాగుంట ఫిక్స్ అయ్యారు. ఎంపీ సీటు ఇవ్వాలని చంద్రబాబుని కోరారు. చంద్రబాబు మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో నిరాశ చెందిన మాగుంట వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆఖరి నిమిషం వరకు మాగుంట వేచి చూశారు.

చంద్రబాబు నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాకపోవడం.. వైసీపీ నుంచి టికెట్ కన్ఫామ్ కావడంతో పార్టీ మారాలని మాగుంట నిర్ణయించుకున్నారు. టీడీపీకి, ఎమ్మెల్సీ పదవికి గురువారం(మార్చి 14) రాజీనామా చేయనున్న మాగుంట.. శుక్రవారం(మార్చి 15) జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు.