అలీ ఎంట్రీ ఫిక్స్: పోటీ ఎక్కడ నుంచంటే? 

  • Published By: vamsi ,Published On : March 11, 2019 / 01:14 AM IST
అలీ ఎంట్రీ ఫిక్స్: పోటీ ఎక్కడ నుంచంటే? 

Updated On : March 11, 2019 / 1:14 AM IST

ఎన్నికల సమయం వచ్చేసింది. షెడ్యూల్ ప్రకటన అయిపోయింది. ఈ క్రమంలో పార్టీలలోకి ఆయారాంలు గయారంలు సిద్ధం అయ్యిపోయారు. సీట్లు రాక కోందరు.. విలువ లేదని కొందరు.. ఎలాగైతేనేం పార్టీలు మారి వారి వారి భవిష్యత్తును ఎలా మలుచుకోవాలని చూసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో గతకొంతకాలంగా అన్నీ పార్టీల చుట్టూ తిరుగుతూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న సినీ నటుడు, కమెడియన్ అలీ ఎట్టకేలకు పార్టీ మారే విషయమై ఒక క్లారిటీకి వచ్చారు. వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్న ఆయన.. ఇవాళ(మార్చి 11, 2019) వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. 
గతంలోనే అలీ వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలవగా ఆయన ఆ పార్టీలో చేరుతారంటూ వార్తలు వచ్చాయి. అయితే తర్వాత చంద్ర‌బాబును కలవడం, గంటాతో చర్చించడం జరిగాక ఆయన తెలుగుదేశంలో చేరుతున్నారని, సీటు కూడా ఖరారు అయ్యిందంటూ వార్తలు వచ్చాయి. అయితే కొన్నాళ్లుగా సాగదీస్తూ వస్తున్న అలీ పొలిటకల్ ఎంట్రీ వార్తలకు ఇప్పుడు ఫల్ స్టాప్ పడబోతుంది. ఇవాళ ఉదయం కాకినాడలో జరిగే వైసీపీ ‘సమర శంఖారావం’ సభలో అలీ జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకుని ఆ పార్టీలో చేరబోతున్నారు.  గుంటూరు పశ్చిమ లేదా రాజమండ్రి నుంచి అసెంబ్లీ నుంచి ఆయన పోటీ చేస్తారని తెలుస్తుంది.