టీఆర్ఎస్ సెంటిమెంట్ : కరీంనగర్ నుంచి ఎన్నికల శంఖారావం

కరీంనగర్: అసెంబ్లీ పోరులో విజయఢంకా మోగించిన గులాబీదండు... లోక్‌సభ ఎన్నికలకు సమాయాత్తమవుతోంది. కలిసొచ్చిన కరీంనగర్ గడ్డపై నుంచే లోక్ సభ ఎన్నికల

  • Published By: veegamteam ,Published On : March 6, 2019 / 03:29 AM IST
టీఆర్ఎస్ సెంటిమెంట్ : కరీంనగర్ నుంచి ఎన్నికల శంఖారావం

Updated On : March 6, 2019 / 3:29 AM IST

కరీంనగర్: అసెంబ్లీ పోరులో విజయఢంకా మోగించిన గులాబీదండు… లోక్‌సభ ఎన్నికలకు సమాయాత్తమవుతోంది. కలిసొచ్చిన కరీంనగర్ గడ్డపై నుంచే లోక్ సభ ఎన్నికల

కరీంనగర్: అసెంబ్లీ పోరులో విజయఢంకా మోగించిన గులాబీదండు… లోక్‌సభ ఎన్నికలకు సమాయాత్తమవుతోంది. కలిసొచ్చిన కరీంనగర్ గడ్డపై నుంచే లోక్ సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతోంది. ఈమేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఅర్.. కరీంనగర్‌లో బుధవారం(మార్చి-6-2019) సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. పేరుకే సన్నాహక సమావేశమైనా… ఎన్నికల శంఖారావం పూరించనున్నారని టీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి.

పార్లమెంట్‌ ఎన్నికలకు టీఆర్ఎస్ సిద్ధమవుతోంది. పార్టీ కేడర్‌ను ఎన్నికలకు సిద్ధం చేస్తూనే… ప్రచారానికి ప్లాన్ చేస్తోంది. 2019, మార్చి 6 నుంచి సన్నాహక సమావేశాల ఏర్పాట్లు చేస్తోంది. సెంటిమెంట్ ప్రకారం కరీంనగర్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని కేసీఆర్ ఆదేశించారు. దీంతో… కరీంనగర్‌ సన్నాహక సమావేశం ద్వారానే ప్రచారం ప్రారంభించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

తెలంగాణ ఉద్యమానికి ఊపిరినిచ్చిన గడ్డగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు పేరుంది. సెంటిమెంట్ పరంగా కలిసొచ్చిన జిల్లా కావడంతో… కేసీఆర్ ఏ పని చేసినా కరీంనగర్ నుంచే మొదలు పెట్టేవారు. ఉద్యమం కీలక దశకు చేరిన సమయంలో కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగింది కూడా కరీంనగర్ నుంచే. తర్వాత రాజీనామాల పర్వం మొదలైంది కూడా ఈ జిల్లా నుంచే. అసెంబ్లీ ఎన్నికల శంఖారావం కూడా ఉమ్మడి కరీంనగర్ పరిధిలోని హుస్నాబాద్ నియోజకవర్గం నుంచే పూరించారు కేసీఆర్. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలకు కూడా… కరీంనగర్ నుంచే సమర శంఖం పూరించే అవకాశం ఉంది. అన్ని పార్లమెంట్ నియోజరవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తుండగా… సెంటిమెంట్ ప్రకారం ఈ సమావేశాన్ని కరీంనగర్‌ నుంచే ప్రారంభిస్తున్నారు కేటీఆర్.

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశాలు జరుగతుండటంతో.. పార్టీ శ్రేణులు బుధవారం(మార్చి-6-2019) నాటి మీటింగ్ కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, 16 స్థానాలు సాధించే దిశగా కేడర్‌ను రెడీ చేయడంపై దృష్టి పెట్టిన కేటీఆర్.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకున్నాక కరీంనగర్ జిల్లాకు కేటీఆర్ రావడం ఇదే మొదటిసారి. ఆయన బాధ్యతలు చేపట్టాక పాల్గొనే అతిపెద్ద బహిరంగ సభ కూడా కరీంనగర్ సభే కావడం మరో విశేషం. మరి కేసీఆర్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా..? అధినేత వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.