కంటతడి పెట్టిన టీఆర్ఎస్ ఎంపీ

ఖమ్మం సిట్టింగ్‌ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కంట తడి పెట్టారు. అనుచరుల ఆవేదన చూసి తట్టుకోలేకపోయిన ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. పొంగులేటికి సీఎం కేసీఆర్ టీఆర్ఎస్

  • Published By: veegamteam ,Published On : March 24, 2019 / 03:38 PM IST
కంటతడి పెట్టిన టీఆర్ఎస్ ఎంపీ

Updated On : March 24, 2019 / 3:38 PM IST

ఖమ్మం సిట్టింగ్‌ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కంట తడి పెట్టారు. అనుచరుల ఆవేదన చూసి తట్టుకోలేకపోయిన ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. పొంగులేటికి సీఎం కేసీఆర్ టీఆర్ఎస్

ఖమ్మం సిట్టింగ్‌ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కంట తడి పెట్టారు. అనుచరుల ఆవేదన చూసి తట్టుకోలేకపోయిన ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. పొంగులేటికి సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ టికెట్‌ నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో పెద్దఎత్తున అనుచరులు పొంగులేటి ఇంటికి వెళ్లారు. టికెట్ ఇవ్వలేదన బాధతో వారంతా కన్నీటి పర్యంతమయ్యారు. వారిని ఓదారుస్తూ శ్రీనివాస్‌ రెడ్డి కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.

కేసీఆర్‌ టికెట్‌ నిరాకరించిన తర్వాత తొలిసారిగా ఖమ్మం వచ్చిన పొంగులేటిని కలిసేందుకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు ఆయన ఇంటికి చేరుకున్నారు. జై శీనన్న అనే నినాదాలతో పొంగులేటి నివాసం మారుమోగింది. ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనంటూ అభిమానులు నినాదాలు చేశారు. నామినేషన్‌ దాఖలు చేయాలని కోరారు. కొందరు కార్యకర్తలు పొంగులేటిపై పడి బోరున విలపించారు. శీనన్నా.. నీకు అన్యాయం జరిగిందంటూ ఏడ్చేశారు.

టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ పొంగులేటిని కాదని.. టీడీపీ నుంచి వచ్చిన నామా నాగేశ్వరరావుకు కేసీఆర్ టికెట్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి సహకరించలేదనే ఆరోపణలతో సీఎం కేసీఆర్.. పొంగులేటికి టికెట్ ఇవ్వలేదు. కేసీఆర్ నిర్ణయంపై పొంగులేటి, ఆయన అనుచరులు ఆవేదనతో ఉన్నారు. ఐదేళ్ల కాలంలో పొంగులేటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని.. నామా నాగేశ్వరరావుకు ఎలా టికెట్ కేటాయిస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ పునరాలోచించాలని డిమాండ్ చేశారు.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం TRSలో చేరారు. ఈసారి తనకే ఛాన్స్ వస్తుందని పొంగులేటి భావించారు. కానీ కేసీఆర్ షాక్ ఇచ్చారు. మార్చి 25 సోమవారంతో నామినేషన్ల దాఖలు గడువు ముగియనుంది.