లోక్ సభ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయాలి : కేటీఆర్

లోక్ సభ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

  • Published By: veegamteam ,Published On : March 16, 2019 / 01:58 PM IST
లోక్ సభ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయాలి : కేటీఆర్

లోక్ సభ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

నల్గగొండ : లోక్ సభ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను ఆశ్వీరదించారని తెలిపారు. తెలంగాణలో 16 ఎంపీ సీట్లలో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చిన మొనగాడు కేసీఆర్ అని అన్నారు. 

నల్లగొండలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సభలో ఆయన ప్రసంగించారు. 16 స్థానాలు టీఆర్ఎస్ గెలుచుకుంటే కేంద్రంలో ఎవరు గద్దెపై కూర్చోవాలో మనమే నిర్ణయించవచ్చన్నారు. కేంద్రం మెడలు వంచి మనకు రావాల్సిన నిధులు సాధించుకోవచ్చని తెలిపారు. కాళేశ్వరానికి జాతీయ హోదా తెచ్చుకోవచ్చన్నారు కేటీఆర్. రాహుల్ చెప్పినట్లు వినే కాంగ్రెస్ నేతలతో ఏమవుతుందని ఎద్దేవా చేశారు. బడితె ఉన్న వారే బర్రెను మలుపుకొని పోతున్నారని తెలిపారు.
Read Also : కోమటిరెడ్డికి కాంగ్రెస్ హ్యండ్.. కారణం ఇదేనా?

’కాంగ్రెస్ లో జోష్ లేదు…బీజేపీకి హోష్ లేదు..తెలంగాణలో హుషారుగా ఉన్నది టీఆర్ఎస్ కార్యకర్తలేనని స్పష్టం చేశారు. అయితే మోడీ..లేకపోతే రాహుల్ ను ప్రధానిని చేయాల్సిన ఖర్మ ప్రజలకెందుకని ప్రశ్నించారు. కేసీఆర్ పథకాలు దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. మోడీ.. రైతు బంధు పేరు మార్చి పీఎం కిసాన్ పేరుతో పెట్టుబడి సాయం చేస్తున్నారని తెలిపారు. బీజేపీకి 103 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతవుతాయని చెప్పారు. బీజేపీకి 150 స్థానాలకు మించి సీట్లు రావన్నారు. కాంగ్రెస్ కు 100 సీట్లు వచ్చే పరిస్థితి లేదని తెలిపారు. వ్యవసాయం దండుగ అన్న చంద్రబాబు..రైతు బంధు పేరు మార్చి రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారని చెప్పారు. మాటలు తప్ప దేశానికి మోడీ చేసిందేమీ లేదని విమర్శించారు. మోడీ చరిష్మా తగ్గిందని సర్వేలు చెబుతున్నాయని వెల్లడించారు.

జాతీయ భావాలున్న పార్టీ టీఆర్ఎస్ అని అన్నారు. పుల్వామాలో ఉగ్రదాడి జరిగితే టీఆర్ఎస్ కార్యక్రమాలు రద్దు చేసుకున్నామని.. 71 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్, బీజేపీలు ఏం చేశాయని ప్రశ్నించారు. రైతు బంధు వంటి ఆదర్శ పథకాలను తెచ్చిన ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు. సీఎం కేసీఆర్ ఆలోచనలు దేశానికి దిక్సూచిగా మారాయ్నారు. ప్రాజెక్టులు పూర్తి అయితే నల్లగొండ అంతా సస్యశ్యామలం అవుతుందన్నారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ నివారణకు చర్యలు చేపట్టామని చెప్పారు. యాదాద్రిని అపురూప పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేశామని చెప్పారు. పోరాటాల పురిటిగడ్డ నల్లగొండ జిల్లా అని కొనియాడారు. నల్గగొండ పార్లమెంట్ సీటుపై గులాబీ జెండా ఎగరవేయాలన్నారు.