వేల కోట్లు ఖర్చైనా ప్రజల ప్రాణాలు కాపాడతాం

తెలంగాణ రాష్ట్రంలో అవసరమైన ప్రతి ఒక్కరికీ కోరాన పరీక్షలునిర్వహిస్తామని ఇప్పటికే ర పరీక్షల సంఖ్య పెంచామనివైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం వైద్యం అందిస్తున్నామని ఆయన తెలిపారు. కరోనా పేషెంట్లకు వైద్యం అందించేదుకు 4వేల700 మంది వైద్యసిబ్బందిని యుద్ధ ప్రాతిపదికన రిక్రూట్ చేసుకున్నామని వీరంతా జూన్ 30 నుంచి విధులకు హజరవుతారని అన్నారు. ప్రస్తుతం ఉన్న 108,104 అంబులెన్స్ లు కాక… మరోక 150 అంబులెన్స్ లు కూడా సిధ్ధంగా ఉంచుకున్నామని ఆయన తెలిపారు.
డబ్బులిచ్చుకునే స్ధోమత ఉన్నప్పటికీ అనుమానితులను ప్రైవేటు ఆస్పత్రుల్లో చేర్చుకోవటం వల్ల అసలైన పేషెంట్లకు వైద్యం అందకుండా పోతోందని..అటువంటి వారిని అడ్మిట్ చేసుకోవద్దని ప్రయివేటు ఆస్పత్రుల యాజమాన్యాలకు సూచించారు. కరోనా మరణాల రేటు తక్కువగా ఉందని.. సోషల్ మీడియాలో వచ్చే దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన కోరారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో మరణాలు లేవని అయన తెలిపారు. ఏమాత్రం అనుమానం ఉన్నా ప్రజల పరీక్షలు చేయించుకుని హోం క్వారంటైన్లో ఉండి ఉపశమనం పొందవచ్చని ఈటల అన్నారు.
హైదరాబాద్ లో కేసులు పెరుగుతున్నదృష్ట్యా కేబినెట్ భేటీ లో చర్చించి లాక్ డౌన్ పై సీఎం గారు నిర్ణయం తీసుకుంటారని మంత్రి వివరించారు. ఆస్పత్రుల్లో వెంటిలేటర్లు లేవు..ఆక్సిజన్ అందడం లేదని చెప్పడం తప్పని ఆయన అన్నారు. 3,500 బెడ్లకు ఆక్సిజన్ సప్లై పూర్తయిందని ఈటల చెప్పారు. నాలుగైదు రోజుల్లో మరో 10 వేల బెడ్లకు ఆక్సిజన్ సదుపాయం సమకూరుస్తామని అన్నారు. ప్రజల ఆరోగ్యం, ప్రాణాల్ని రక్షించేందుకు ప్రబుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని ఈటల చెప్పారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 10 మంది మాత్రమే వెంటిలేటర్ పై ఉన్నారని…ఎన్నివేల కోట్లు ఖర్చైనా ప్రజల ప్రాణాలను కాపాడతామని ఆయన హామీ ఇచ్చారు.
Read: హోం మంత్రికి కరోనా పాజిటివ్