జగన్ వెన్నుపోటు పొడిచారు : టీడీపీలో చేరిన వంగవీటి రాధా
అమరావతి: వంగవీటి రాధా టీడీపీలో చేరారు. సీఎం చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు. జగన్ కు మళ్లీ ప్రతిపక్ష స్థానమే దక్కుతుందని రాధా జోస్యం

అమరావతి: వంగవీటి రాధా టీడీపీలో చేరారు. సీఎం చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు. జగన్ కు మళ్లీ ప్రతిపక్ష స్థానమే దక్కుతుందని రాధా జోస్యం
అమరావతి: వంగవీటి రాధా టీడీపీలో చేరారు. సీఎం చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు. జగన్ కు మళ్లీ ప్రతిపక్ష స్థానమే దక్కుతుందని రాధా జోస్యం చెప్పారు. జగన్ నాకు వెన్నుపోటు పొడిచారు అని రాధా ఆరోపించారు. ఇతరులతో కలిసి జగన్ ఏపీకి ద్రోహం చేశారని మండిపడ్డారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేతగా జగన్ మారాలని హితవు పలికారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన చంద్రబాబుకి రాధా ధన్యవాదాలు తెలిపారు.
వంగవీటి రాధా విలువులు ఉన్న వ్యక్తి అని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. తన తండ్రి ఆశయాల సాధన కోసమే రాధా టీడీపీలో చేరారని చెప్పారు. పేదల కోసం వంగవీటి రాధా తండ్రి పరితపించారని గుర్తు చేశారు. ఏపీ ఎన్నికలు తొలి దశలోనే నిర్వహిస్తున్నారని, ఎలాంటి సంక్షోభం ఎదురైనా అవకాశంగా మలుచుకుంటామని చంద్రబాబు అన్నారు. బీసీలు, కాపుల మధ్య చిచ్చు పెట్టాలని కొందరు చూశారని చంద్రబాబు ఆరోపించారు.
బీసీలకు అన్యాయం జరగకుండా కాపుల రిజర్వేషన్లను ఆమోదించామన్నారు. నా దగ్గర పని చేసిన కేసీఆర్ నాకే సవాల్ విసురుతున్నాడు అని మండిపడ్డారు. కేసీఆర్ ను వదిలి పెట్టం అన్నారు. హైదరాబాద్ నుంచి మనకు రావాల్సిన ఆస్తుల వాటాను ఇవ్వలేదు అన్నారు. దుష్ట శక్తుల నుంచి ఏపీని కాపాడుకునే శక్తి ఒక్క టీడీపీకే ఉందని చంద్రబాబు అన్నారు.