భయమా? ఒత్తిళ్లా? బీఆర్ఎస్ నేతలు పార్టీ వీడటానికి కారణాలు ఏంటి?

ఎందుకు పార్టీల నేతలు ఇంత భయాందోళనకు గురవుతున్నారు? బీఆర్ఎస్ లో ఉన్న నేతలు అందరూ పక్క చూపులు ఎందుకు చూస్తున్నారు?

భయమా? ఒత్తిళ్లా? బీఆర్ఎస్ నేతలు పార్టీ వీడటానికి కారణాలు ఏంటి?

Telangana Politics

Updated On : March 18, 2024 / 9:16 PM IST

Telangana Politics : తెలంగాణలో పవర్ గేమ్ మొదలైంది. అధికారం ఎక్కడుంటే అక్కడికి నాయకులు వెళ్లిపోవడం అన్నది ఎప్పటి నుంచో జరుగుతున్నప్పటికీ.. అసెంబ్లీ ఎన్నికల ముందు అది కొంత ఊపందుకుంది. ఇప్పుడు మళ్లీ లోక్ సభ ఎన్నికల ముందు మరింత ఎక్కువైంది. ముఖ్యంగా గతంలో ఓవర్ లోడ్ తో వెళ్లిన కారులో.. ఇప్పుడు ప్యాసింజర్లే లేని పరిస్థితి ఉంది. కారు నుంచి నేతలు అంతా దిగి బీజేపీ వైపు లేదా కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు.

ముఖ్యంగా జాతీయ పార్టీలవైపు చూస్తున్నారు. దీని వెనుక ఉన్న కారణం ఏంటి? లీడర్లపై ఏమైనా ఒత్తిళ్లు పని చేస్తున్నాయా? అధికార పార్టీలు.. ఇతర పార్టీల నేతలను ఇబ్బంది పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయా? ఎందుకు పార్టీల నేతలు ఇంత భయాందోళనకు గురవుతున్నారు? బీఆర్ఎస్ లో ఉన్న నేతలు అందరూ పక్క చూపులు ఎందుకు చూస్తున్నారు?

Also Read : జితేందర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంపై డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు.. శ్రీనివాస్ గౌడ్ గురించి ఏమన్నారంటే?