అధికారం లేనప్పుడు పార్టీ జెండాలు మోసిన వారికి : సీఎం జగన్ న్యాయం చేస్తారనే నమ్మకముంది

కృష్ణా జిల్లా గన్నవరం రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సీఎం జగన్ ని కలవడం చర్చకు దారితీసింది. వంశీ వైసీపీలో చేరతారనే ప్రచారం

  • Published By: veegamteam ,Published On : October 27, 2019 / 10:15 AM IST
అధికారం లేనప్పుడు పార్టీ జెండాలు మోసిన వారికి : సీఎం జగన్ న్యాయం చేస్తారనే నమ్మకముంది

Updated On : October 27, 2019 / 10:15 AM IST

కృష్ణా జిల్లా గన్నవరం రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సీఎం జగన్ ని కలవడం చర్చకు దారితీసింది. వంశీ వైసీపీలో చేరతారనే ప్రచారం

కృష్ణా జిల్లా గన్నవరం రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సీఎం జగన్ ని కలవడం చర్చకు దారితీసింది. వంశీ వైసీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. అయితే వంశీ రాకను వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఈ వ్యవహారంపై సీఎం జగన్‌ ని కలుస్తానని యార్లగడ్డ తెలిపారు. గన్నవరం వైసీపీ ఆఫీస్‌లో కార్యకర్తలు, శ్రేయోభిలాషులతో యార్లగడ్డ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వంశీ చేరికపై చర్చించి సోమవారం(అక్టోబర్ 28,2019) సీఎంను కలవాలని యార్లగడ్డ నిర్ణయించారు. అధికారం లేనప్పుడు పార్టీ జెండా మోసిన కార్యకర్తలు చాలా అవసరమని అన్నారు. జగన్‌ న్యాయం చేస్తారనే విశ్వాసం ఉందన్నారు. అభిమానుల మనోభావాలు పట్టించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కచ్చితంగా అనుకూల నిర్ణయమే వస్తుందని భావిస్తున్నట్టు యార్లగడ్డ చెప్పుకొచ్చారు.

జగన్ తో యార్లగడ్డ భేటీ తర్వాత ఈ వ్యవహారానికి ఫుల్‌ స్టాప్ పడుతుందా.. లేక మరింత ముదురుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. సీఎం జగన్ ఏం తేలుస్తారు అనేది ఇటు యార్లగడ్డ.. అటు వంశీ అభిమానుల్లో ఉత్కంఠగా మారింది.

గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ కండువా కప్పుకుంటారని వార్తలు వస్తున్నాయి. వంశీని దగ్గరుండి మరీ ఇద్దరు మంత్రులు సీఎం జగన్ తో భేటీ జరిపించడం ఈ వార్తలకు మరింత బలాన్ని ఇచ్చింది. వంశీ కనుక వైసీపీలో చేరితో.. గన్నవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు పరిస్థితి ఏంటనేది సందేహంగా మారింది.