నేడే వైసీపీ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల

  • Published By: vamsi ,Published On : March 13, 2019 / 01:37 AM IST
నేడే వైసీపీ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల

ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రధాన పార్టీలు అభ్యర్ధులను ఎంపికచేసి ప్రకటించేందుకు సిద్ధం అయ్యారు. ఈ క్రమంలో ఇవాళ(13 మార్చి 2019) వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల తొలి జాబితాను విడుదల చేయనుంది. ఉదయం 10గంటల తర్వాత ఏ సమయంలో అయినా కూడా పార్టీ తొలి జాబితాను విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు గాను తొలి విడతలో 100మందికి పైగా అభ్యర్ధులను ఖరారు చేసే అవకాశం ఉంది. అలాగే ఎంపీ అభ్యర్ధులను కూడా 15మంది వరకు ఖరారు చేస్తారని చెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా గెలుపు గుర్రాలకే టిక్కెట్లను కేటాయించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 
మరోవైపు ఎన్నికల ప్రచార పర్వాన్ని మార్చి 16వ తేదీ నుంచి వైసీపీ అధినేత జగన్ ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది. మొత్తం 13 జిల్లాల్లో పర్యటనకు ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధం చేయనున్నారు. ఎన్నికల ప్రచారయాత్రను పెనుగొండ, గాజువాక లేదా గురజాలలో ఏదో ఒక చోట నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పార్టీ సీనియర్ నేతలు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, తలశిల రఘురామ్‌‌తో జగన్ చర్చించినట్లు సమాచారం.