Ram Navami 2022 : భద్రాద్రి రామయ్య కళ్యాణానికి ఎదుర్కోలు ఉత్సవం
భద్రాచలంలో శ్రీసీతారామచంద్ర స్వాముల వారి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం గం.10-30 లకు శ్రీ సీతారాముల కళ్యాణం జరగనుంది.

Bhadrachalam
Ram Navami 2022 : భద్రాచలంలో శ్రీసీతారామచంద్ర స్వాముల వారి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం గం.10-30 లకు శ్రీ సీతారాముల కళ్యాణం జరగనుంది. 11వ తేదీన శ్రీరామచంద్రుల వారి పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం మిథిలా స్టేడియంలో స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నారు.
ఆదివారం ఉదయం జరిగే దేవదేవుని కళ్యాణానికి విచ్చేసే భక్తుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మిథిలా స్టేడియంలో చలువ పందిళ్లు వేశారు. 2.5లక్షల తలంబ్రాల పాకెట్లు సిధ్దం చేశారు. భద్రాద్రి ఆలయాన్ని రంగురంగుల విద్యుదీపాలతో అలంకరించారు. రేపు జరిగే స్వామి వారి కళ్యాణోత్సవానికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి పువ్వాడ అజయ్ కుమార్ హాజరు కానున్నారు. 11వ తేదీన జరిగే మహా పట్టాభిషేక మహోత్సవంలో గవర్నర్ తమిళ్ సై పాల్గోంటారు.
Also Read : Ram Navami 2022 : రామతీర్థం శ్రీ సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధం
వసంతపక్ష ప్రయుక్త నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం భద్రాద్రి దివ్యక్షేత్రంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భేరీ పూజను నేత్రపర్వంగా జరిపారు. మేళతాళాలు, వేదమంత్రాల నడుమ గరుడపటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేశారు.
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే
రఘునాథాయ నాథాయ సీతాయాఃపతయే నమః

Bhadrachalam