Samatha Murthi : ముచ్చింతల్‌‌కు పోటెత్తుతున్న ప్రజలు.. వెల్లివెరుస్తున్న ఆధ్మాత్మిక వాతావరణం

శంషాబాద్ లోని ముచ్చింతల్ కు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఆ ప్రాంతమంతా ఆధ్మాత్మిక వాతావరణం నెలకొని ఉంది. 216 అడుగులు ఎత్తైనా సమతామూర్తి విగ్రహాన్ని చూసేందుకు

Samatha Murthi : ముచ్చింతల్‌‌కు పోటెత్తుతున్న ప్రజలు.. వెల్లివెరుస్తున్న ఆధ్మాత్మిక వాతావరణం

Samata Murthi

Updated On : February 6, 2022 / 12:48 PM IST

Sri Bhagavad Ramanujacharya : శంషాబాద్ లోని ముచ్చింతల్ కు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఆ ప్రాంతమంతా ఆధ్మాత్మిక వాతావరణం నెలకొని ఉంది. 216 అడుగులు ఎత్తైనా సమతామూర్తి విగ్రహాన్ని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. భక్తి ప్రవత్తులతో ఇక్కడకు తరలి వస్తున్నారు. విగ్రహం వద్ద సెల్ఫీలు దిగడానికి పోటీ పడుతున్నారు. ఒక వైపు మంత్రాలు, మరోవైపు ఆధ్మాత్మిక ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ముచ్చింతల్ మురిసిపోతోంది. యాగశాలల ప్రాంతాన్ని ప్రత్యేక ఆలయంగా పరిగణిస్తున్నారు. ఉదయం 6.30 గంటలకు అష్టాక్షరీ మహామంత్ర జపంతో ప్రారంభమౌతోంది. తర్వాత హోమాలు నిర్వహిస్తున్నారు.

Read More : Lata Mangeshkar: మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో లతామంగేష్కర్ అంత్యక్రియలు

5 వేల మంది రుత్విజులు పూజల్లో పాల్గొంటున్నారు. సాయంత్రం మరోసారి హోమాలు నిర్వహిస్తున్నారు. చిన్న జీయర్ స్వామి ప్రవచనాలు వినడానికి, యాగాలను తిలకించడానికి ఎక్కడి నుంచో ప్రజలు తరలివస్తున్నారు. దీంతో ముచ్చింతల్ ప్రాంతం సందడి సందడిగా మారింది. 216 అడుగుల ఎత్తైన సమతామూర్తి విగ్రహం కలిగిన ముచ్చింతల్ మరో అద్భుత పర్యాటక క్షేత్రంగా మారుతుందని అంటున్నారు. సహస్రాబ్ది ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను నడుపుతోంది. 14వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి.

Read More : Lata Mangeshkar: గాయకులు ఎందరొచ్చినా ఆమె లోటును తీర్చలేరు – సీఎం కేసీఆర్

సమతా సూత్రాన్ని లోకానికి అందించిన శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో శనివారం సాయంత్రం కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. కులం, మతం, విశ్వాసాల్లో నిజమైన సమానత్వాన్ని ప్రోత్సాహించాలన్న శ్రీరామానుజ బోధనలు స్మరించుకుంటూ… 216 అడుగులు ఎత్తైనా సమతామూర్తి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోకార్పణ చేశారు. ప్రతి రోజు శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి సంకల్ప పూర్వకంగా పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు విశేష రీతిలో ఆధ్మాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గోవింద నామాలతో ప్రతి ధ్వనిస్తోంది. రామనామంతో పులకిస్తోంది.