Indrakiladri: ఇంద్రకీలాద్రిపై 3 రోజులు పవిత్రోత్సవాలు

తొలి రోజు ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తారు.

Indrakiladri: ఇంద్రకీలాద్రిపై 3 రోజులు పవిత్రోత్సవాలు

Indrakeeladri

Updated On : August 9, 2023 / 6:25 PM IST

Indrakiladri – Vijayawada: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh ) విజయవాడలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై ఈ నెల 30 నుంచి సెప్టెంబరు 1 వరకు పవిత్రోత్సవాలు (Pavitrotsavalu) నిర్వహించనున్నారు. ఈ మూడు రోజుల పాటు జరగనున్న పవిత్రోత్సవాల సందర్భంగా‌ ఈ నెల 30 తెల్లవారుజామున 3 గంటలకు అమ్మవారి సుప్రభాతం, స్నపనాభిషేకం నిర్వహిస్తారు.

తొలి రోజు ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తారు. సెప్టెంబరు 1న ఉదయం 10.30 గంటలకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. పవిత్రోత్సవాల సందర్భంగా ఈ నెల 30 నుంచి సెప్టెంబరు ఒకటో తేదీ వరకు అన్ని ఆర్జిత‌ సేవలనూ రద్దు చేస్తారు. అమ్మవారికి దేవస్థాన అర్చకులు నిత్య కైంకర్యాలు నిర్వహించనున్నారు.

Right Order to Eat Your Food : భోజనంలో ముందుగా ఏది తినాలి? ఏది తినకూడదు?