Tirumala – Tirupati: తిరుమల, తిరుపతిలో మూడ్రోజుల పాటు మెగా మ్యూజికల్ ఈవెంట్
మెగా మ్యూజికల్ ఈవెంట్ సందర్భంగా ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. జనవరి 31నుంచి ఫిబ్రవరి 2వరకూ పురంధరదాస ఆరాధనా మహోత్సవం కార్యక్రమాన్ని దశ సాహిత్య ప్రాజెక్ట్ వారు నిర్వహించనున్నారు.

Tirumala
Tirumala – Tirupati: తిరుమల తిరుపతి దేవస్థానంలో జరగనున్న మెగా మ్యూజికల్ ఈవెంట్ సందర్భంగా ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. జనవరి 31నుంచి ఫిబ్రవరి 2వరకూ పురంధరదాస ఆరాధనా మహోత్సవం కార్యక్రమాన్ని దశ సాహిత్య ప్రాజెక్ట్ వారు నిర్వహించనున్నారు.
తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సోమవారం సాయంత్రం 6 నుంచి 8గంటల వరకూ హరిదాస రంజని కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా దాస భజనలు జరగనున్నాయి. తిరుమలలోని ఆస్థాన మండపంలో ధ్యానం, నగర సంకీర్తనం, భజనలు వంటివి నిర్వహిస్తారు.
దాస సాహిత్య ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ పీఆర్ ఆనంద తీర్థాచార్యులు.. శ్రీ పురందరదాస విగ్రహానికి మంగళవారం నివాళులర్పిస్తారు. సాయంత్రం 6గంటలకు తిరుమల వైభవోత్సవ మండపం వద్ద బృందగానం జరుగుతుంది. బుధవారం తిరుమల ఆస్థాన మండపం వద్ద ముగింపు కార్యక్రమం జరిపిస్తారు.