Bathukamma 2023 : ఆరో రోజు అలిగిన బతుకమ్మ .. అలక వెనుక ఆసక్తికర కథలు
ఆరో రోజు అలిగిన బతుకమ్మ పేరుతో జరుపుకుంటారు. ఎంగిలిపువ్వు బతుకమ్మ, అటుకల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ వేడుకలు ముగిశాయి. ఆరో రోజు అలిగిన బతుకమ్మగా జరుపుకుంటారు. ఆరో రోజును 'అలిగిన బతుకమ్మ' అని ఎందుకు అంటారంటే..

Bathukamma
Bathukamma 2023 : తెలంగాణ ఆడపడచుల పూల పండుగ బతుకమ్మ పండుగ.తొమ్మిది రోజుల పాటు కొనసాగే ఈ పండుగలో రోజు పేరుతో బతుకమ్మలను ఆడతారు. పాటలు పాడుతు..ఆటలు ఆడుతు గౌరమ్మను కొలుచుకుంటారు. బతుకమ్మ పండుగ వచ్చిదంటే ప్రతీ ఇల్లు పూల గుభాళింపులతో పరవశించిపోతాయి. తెలంగాణలోని నగరం, గ్రామం అనే తేడా లేకుండా ప్రతీ వీధిలోను సందడి సందడిగా కనిపిస్తుంది.
మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే సంబురాలు ఆఖరి రోజు అంటే తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఇప్పటికే ఐదు రోజులు బతుకమ్మ సంబరాలు కొనసాగాయి. దీంట్లో భాగంగా ఆరో రోజు అలిగిన బతుకమ్మ పేరుతో జరుపుకుంటారు. ఎంగిలిపువ్వు బతుకమ్మ, అటుకల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ వేడుకలు ముగిశాయి. ఆరో రోజు అలిగిన బతుకమ్మగా జరుపుకుంటారు. ఆరో రోజును ‘అలిగిన బతుకమ్మ’ అని ఎందుకు అంటారు అంటే.. ఆరో రోజు అమ్మవారు అలకతో ఉంటారని నమ్ముతారు. ఆ అలక తీరాలని బతుకమ్మను ప్రార్థిస్తారు. అందుకేనేమో ఆరో రోజు బతుకమ్మకు ఎటువంటి నైవేద్యాలు పెట్టరు. దీని వెనుక కొన్ని కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
Bathukamma 2023 : పూల వేడుకలో ఐదో రోజు అట్ల బతుకమ్మ .. నైవేద్యాల ప్రత్యేకత ఇదే
ఎప్పుడో పురాతన కాలంలో బతుకమ్మను పేర్చే సమయంలో అనుకోకుండా మాంసం ముద్ద తగలడంతో అపచారం జరిగిందని దాంతో బతుకమ్మ అలిగింది అని అంటారు. అందుకే మొదటి ఐదు రోజులు బతుకమ్మ ఆటలు ఆడే ఆడబిడ్డలకు ఆరో రోజు రోజు బతుకమ్మను ఆడరు. అలా ఆరో రోజును ‘అలిగిన బతుకమ్మ’గా పిలుస్తారు.
అలగే మరో కథ ప్రకారం..అమ్మవారి మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి రూపాలలో రాక్షస సంహారం చేశారని.. సంహరించిన తర్వాత అమ్మవారు బాగా అలసిపోయారని ఆరోజు ఆమెకు పూర్తి విశ్రాంతి ఇవ్వాలని అందుకే బతుకమ్మ ఆడరని అంటారు. ఆరో రోజు బతుకమ్మను పేర్చరు కూడా. ఈ ఆరోరోజు బతుకమ్మ పేర్లలో కూడా కొన్ని తేడాలుంటాయి. కొంతమంది అర్రెం అని..మరికొందరు అలసిన బతుకమ్మ అని అంటారు. ఆరో రోజు అలిగిన బతుకమ్మ పేర్చరు. ఆడరు. తిరిగి ఏడవ రోజే తిరిగి బతుమకమ్మను పేరుస్తారు. బతుకమ్మ ఆటలు ఆడతారు. పండుగను ఘనంగా జరుపుకుంటారు.