Tirumala Brahmotsavams : ఈనెల 7 నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 7 నుంచి 15 వరకు జరుగుతాయని టీటీడీ అధికారులు తెలిపారు.

Tirumala Brahmotsavams
Tirumala Brahmotsavams : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 7 నుంచి 15 వరకు జరుగుతాయని టీటీడీ అధికారులు తెలిపారు. కోవిడ్ కారణంగా ఈసారి కూడా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగానే నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 11న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారని అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా తిరుమలలో సీఎం జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాలు.. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
ఈ క్రమంలో సీఎం జగన్ అలిపిరి వద్ద నూతనంగా నిర్మించిన గోమందిరంను ప్రారంభించనున్నారు. పాత బర్డ్ హాస్పిటల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అలానే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ కన్నడ, హిందీ భాషలలో ప్రారంభించనున్నారు. తిరుమలలో స్వామివారి ప్రసాదాల తయారీకి నూతనంగా నిర్మించిన బూందీ పోటు నిర్మాణాన్ని కూడా ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు.