TTD : తిరుమలలో వరహస్వామి జయంతి

తిరుమల పుణ్యక్షేత్రంలోని భూ వరహస్వామి వారి ఆలయంలో వరహ జయంతి సందర్భంగా...శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.

TTD : తిరుమలలో వరహస్వామి జయంతి

Ttd News

Updated On : September 9, 2021 / 6:37 PM IST

Varaha Jayanti : తిరుమల పుణ్యక్షేత్రంలోని భూ వరహస్వామి వారి ఆలయంలో వరహ జయంతి సందర్భంగా…శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. 2021, సెప్టెంబర్ 09వ తేదీ గురువారం ఉదయం కలశస్థాపన, కలశ పూజ, పుణ్యహవచనం చేశారు. ఉదయం 09 గంటల నుంచి 10 గంటల మధ్య పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో స్వామి వార్ల ఉత్సవర్లకు వేదక్తంగా పూజలు చేశారు.

Read More : Tirupati : విలీనం కానున్న తిరుపతి ఎయిర్ పోర్టు!

తిరుమంజనం, మూలవర్లకు ప్రోక్షణ నిర్వహించారు. ప్రతి సంవత్సరం వరహస్వామి జయంతిని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహిస్తోందనే సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా..ఆలయ ఈవో డా. కేఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ…శ్రీ మహా విష్ణువు కోసం లోక కళ్యాణం కోసం వరహస్వామి వారి అవతారమెత్తి హిణ్యాక్షుడిని సంహరించి..భూదేవిని రక్షించినట్లు పురణాలు చెబుతున్నట్లు తెలిపారు.

Read More : Cow : గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని.. హైదరాబాద్ నుండి తిరుపతికి పాదయాత్ర

తిరుమలలో తొలి పూజ, తొలి నివేదన వరహస్వామి వారికే చేస్తారని తెలిపారు. ఈ జయంతిని పురస్కరించుకుని…స్వామి వారి ఉత్సవర్లకు తిరుమంజనం నిర్వహించామన్నారు. వరహస్వామి జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో…ఆలయ అధికారులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.