ఈ ఇద్దరు బౌలర్లను కోట్లాది రూపాయలు పోసి కొంటే.. మరీ ఇలా తుస్సుమంటున్నారేంటి?
ఇరగదీస్తాడని అందరూ భావిస్తే ఇలా ఆడుతున్నారేంటి?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో రషీద్ ఖాన్‌ను గుజరాత్ టైటాన్స్ రూ.18 కోట్లకు తీసుకుంది. కోట్లాది రూపాయల ధరకు అమ్ముడుపోయినప్పటికీ అందుకు న్యాయం చేయకపోతున్నాడు అతడు. ప్రస్తుత ఐపీఎల్‌లో అతడి పెర్ఫార్మన్స్ బాగోలేకపోవడంతో విమర్శలు వస్తున్నాయి.
టీ20ల్లో అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా రషీద్ ఖాన్‌కి పేరు ఉంది. గత సీజన్లలో స్థిరంగా రాణించాడు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను రూ.16.50 కోట్లకు కొంటే అంత కంటే ఎక్కువగా రషీద్ ఖాన్ కోసం వెచ్చించింది. రషీద్ బౌలింగ్‌లో ఇరగదీస్తాడని అందరూ భావించారు.
Also Read: రూ.23.75 కోట్లకు వెంకటేశ్ అయ్యర్‌ను కొన్న కోల్‌కతా.. అయినప్పటికీ ఇలా చెత్తగా..
ఈ అఫ్ఘాన్ లెగ్ స్పిన్నర్ ఇప్పటివరకు జరిగిన మ్యాచుల్లో పేలవ ప్రదర్శన కనబర్చాడు. ఏడు మ్యాచుల్లో 63.25 సగటు, 9.73 ఎకానమీ రేటుతో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు. గుజరాత్ టీమ్‌లోని మిగతా ఆటగాళ్లు బాగా రాణిస్తుండడంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. రషీద్ ఖాన్ మాత్రం రాణించడం లేదు.
మరోవైపు, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా అధిక ధరకు అమ్ముడుపోయి ఏ మాత్రం రాణించడం లేదు. ఏడు మ్యాచులు ఆడి కేవలం ఏడు వికెట్లు మాత్రమే తీశాడు. అతడిని సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.18 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో అతడి కెప్టెన్సీలో ఎస్‌ఆర్‌హెచ్ ఏడు మ్యాచ్‌లలో కేవలం రెండు విజయాలను మాత్రమే సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిదవ స్థానంలో ఉంది.