అదేం కొట్టుడు సామీ.. నా కెరీర్ మొత్తంలో నేను కొట్టిన సిక్సర్ల కంటే.. అభిషేక్ రెండు గంటల్లో.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కామెంట్స్ వైరల్
టీమ్ఇండియా యువ ఆటగాడు అభిషేక్ శర్మపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ ప్రశంసల వర్షం కురిపించాడు.

Abhishek Sharma Hit More Sixes in Two Hours Than I Hit in My Whole Life Says Alastair Cook
ఇంగ్లాండ్‌తో ముంబై వేదికగా జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో అభిషేక్ శర్మ విధ్వంసకర శతకం చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. వాంఖడే స్టేడియం మొత్తం అభిషేక్ శర్మ బౌండరీల వర్షంలో తడిసి ముద్దైంది. 17 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన అతడు 37 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు. ఇక ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 54 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ శర్మ 7 ఫోర్లు, 13 సిక్సర్లు బాది 135 పరుగులు చేశాడు.
అభిషేక్ శర్మ శతకంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ ఘోరంగా విఫలమైంది. 10.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 150 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది.
Abhishek Sharma : వండర్ ఫుల్.. అభిషేక్ శర్మ మరో వెరైటీ రికార్డు.. కోహ్లీ, సూర్య, గిల్ సరసన..
Alastair Cook said, “Abhishek Sharma hit more sixes in two hours than I hit in my whole life”. pic.twitter.com/SN3jnuvY4W
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 2, 2025
ఇదిలా ఉంటే.. అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ సర్ అలిస్టర్ కుక్ సైతం అభిషేక్ ఇన్నింగ్స్‌ను కొనియాడాడు. తన సుదీర్ష క్రికెట్ కెరీర్ మొత్తం కలిపి కూడా నిన్న రెండు గంటల్లో అభిషేక్ శర్మ కొట్టినన్ని సిక్సర్లను కొట్టలేకపోయినట్లు చెప్పుకొచ్చాడు.
ఇంగ్లాండ్ దిగ్గజ ఆటగాళ్లలో మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ ఒకడు. తన సుదీర్ఘ కెరీర్‌లో ఇంగ్లాండ్ తరుపున 161 టెస్టులు, 92 వన్డేలు, 4 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 45.4 సగటుతో 12472 పరుగులు చేశాడు. ఇందులో 33 సెంచరీలు, 57 అర్థశతకాలు ఉన్నాయి. ఇక 92 వన్డేల్లో 36.4 సగటుతో 3204 పరుగులు చేశాడు. ఇందులో 5 శతకాలు, 19 అర్థశతకాలు ఉన్నాయి. నాలుగు టీ20ల్లో 15.2 సగటుతో 61 పరుగులు చేశాడు.
అలిస్టర్ కుక్ ఎక్కువగా బంతిని గాల్లోకి లేపడు. సుదీర్ఘ ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరు. ఈ క్రమంలో టెస్టు ఆటగాడిగా ముద్ర పడ్డాడు. 161 టెస్టులు ఆడిన కుక్ కేవలం 11 సిక్సర్లు మాత్రమే కొట్టాడు. ఇక 92 వన్డేల్లో 10 సిక్సర్లు మాత్రమే బాదాడు. ఈ క్రమంలోనే అభిషేక్ రెండు గంటల్లో కొట్టిన సిక్సర్లను తన సుదీర్ఘ కాల క్రికెట్ కెరీర్‌లో కొట్టలేదని అన్నాడు. మొత్తానికి ఈ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అభిషేక్ శర్మ బ్యాటింగ్‌కు ఫిదా అయినట్లుగా చెప్పుకొచ్చాడు.