Cheteshwar Pujara : తొలి టెస్టులో టీమ్ఇండియా ఓట‌మి.. నిన్న ర‌హానే, నేడు పుజారా పోస్ట్‌లు.. ఏం చెప్పాల‌ని అనుకుంటున్నారో..?

Cheteshwar Pujara - Ajinkya Rahane : భార‌త సీనియ‌ర్ ఆట‌గాళ్లు అజింక్యా ర‌హానే, చెతేశ్వ‌ర్ పుజారా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

Cheteshwar Pujara : తొలి టెస్టులో టీమ్ఇండియా ఓట‌మి.. నిన్న ర‌హానే, నేడు పుజారా పోస్ట్‌లు.. ఏం చెప్పాల‌ని అనుకుంటున్నారో..?

Pujara-Rahane

భార‌త సీనియ‌ర్ ఆట‌గాళ్లు అజింక్యా ర‌హానే, చెతేశ్వ‌ర్ పుజారా ల‌ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. పరిమిత ఓవ‌ర్ల క్రికెట్‌ను వీరిద్ద‌రు ఎక్కువ‌గా ఆడ‌న‌ప్ప‌టికీ టెస్టుల్లో టీమ్ఇండియా త‌రుపున అద్భుత ఇన్నింగ్స్‌లు ఎన్నో ఆడారు. ఒంటి చేత్తో భార‌త్‌కు ఎన్నో విజ‌యాల‌ను అందించారు. అయితే.. గ‌త‌కొంత‌కాలంగా వీరిద్ద‌రు జాతీయ జ‌ట్టుకు దూరం అయ్యారు. ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు వీరిద్ద‌రిని సెల‌క్ట‌ర్లు ప‌క్క‌న బెట్టారు. దీంతో ఇక వీరి కెరీర్ ముగిసింద‌నే అభిప్రాయానికి చాలా మంది వ‌చ్చేశారు.

అయితే.. వీరిద్ద‌రు మాత్రం ఆశ‌ల‌ను కోల్పోలేదు. మ‌రోసారి టీమ్ఇండియా త‌రుపున ఆడ‌తామ‌నే గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు. ప్ర‌స్తుతం టీమ్ఇండియా ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో ఉంది. సెంచూరియ‌న్ వేదిక‌గా జ‌రిగిన మొద‌టి టెస్టు మ్యాచులో భార‌త్ ఇన్నింగ్స్ 32 ప‌రుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. ఈ క్ర‌మంలో ప‌లువురు మాజీ ఆట‌గాళ్లు ర‌హానే, పుజారాల‌ను ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు ఎంపిక చేయ‌క‌పోవ‌డాన్ని త‌ప్పుబ‌డుతున్నారు.

Rishabh Pant : మృత్యువును జయించిన రిష‌బ్ పంత్‌.. ఏడాది పూర్తి.. ఆ రోజు ఏం జరిగిందంటే..?

భార‌త జ‌ట్టు ఓట‌మి నేప‌థ్యంలో వీరిద్ద‌రు ఒక్క రోజు వ్య‌వ‌ధిలో సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. శ‌నివారం చెతేశ్వ‌ర్ పుజారా ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశాడు. రంజీట్రోఫీకి సిద్ద‌మ‌వుతున్న‌ట్లు ఆ వీడియోకి క్యాప్ష‌న్ ఇచ్చాడు. జనవరి 5 నుంచి రంజీ సీజ‌న్ ఆరంభం కానుంది. సౌరాష్ట్ర త‌రుపున పుజారా ఆడుతున్నాడు.

అంత‌క‌ముందు రోజు ర‌హానే సైతం ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను పంచుకున్నాడు. ఆ వీడియోకి ప్రాక్టీస్‌కు విశ్రాంతి అనేది లేదు అంటూ రాసుకొచ్చాడు.

Irfan Pathan : సునీల్ గ‌వాస్క‌ర్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ఇర్ఫాన్ ప‌ఠాన్‌.. అంగీకరించ‌ని దిగ్గ‌జ ఆట‌గాడు.. ఇద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగిందంటే..?

సుదీర్ఘ ఫార్మాట్‌లో 85 మ్యాచ్‌ల్లో అజింక్య రహానే 38.46 సగటుతో 5077 పరుగులు చేశాడు. అతడు చివరిగా జూలైలో వెస్టిండీస్‌లో టెస్టు మ్యాచ్ ఆడాడు. చెతేశ్వర్ పుజారా ఇప్పటివరకు 103 టెస్టులు ఆడి 43.60 సగటుతో 7195 పరుగులు చేశాడు. అతను చివరిసారిగా జూన్‌లో ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్ ఆడాడు.