ఇక్కడే బాగుంది: న్యూజిలాండ్‌లో షికార్లు కొడుతున్న విరుష్కా జోడి

విదేశీ పర్యటనల్లో కోహ్లీకి తోడై ఉండడానికే ప్రయత్నిస్తుంది అనుష్క శర్మ. సెలవు రోజుల్లో కెప్టెన్ కోహ్లీ కూడా అనుష్క తప్ప వేరే ప్రపంచం లేదన్నట్లే కనిపిస్తాడు. ఆస్ట్రేలియా పర్యటనలో చెట్టాపట్టాలేసుకుని తిరిగేసిన ఈ జంట. న్యూజిలాండ్‌లోనూ చక్కర్లు కొట్టేస్తున్నారు. పైగా తాము ఎవరో తెలియని చోట తిరగడం చాలా సంతోషంగా ఉందంటూ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు.
అందరిలా సాధారణ జీవితం గడిపే అవకాశం తమకు లభించిందని అంటున్నాడు విరాట్. ‘నేను, అనుష్క విదేశాల్లో సాధారణమైన జీవితం గడుపుతున్నాం. బయట వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతూ నేపియర్ లాంటి అందమైన ప్రదేశాల్లో విహరించడం ఆనందంగా ఉంది. మెరైన్ పరేడ్‌కు వెళ్లి నిండు చంద్రుణ్ని మనసారా ఆస్వాదిస్తూ బల్ల మీద కూర్చుని కబుర్లు చెప్పుకున్నాం’
‘స్వదేశంలో ఎక్కడికి వెళ్లినా అభిమానులు చుట్టుముట్టేస్తుంటారు. మనమంటే తెలీని వ్యక్తుల మధ్య తిరగడమంటే మాకిష్టం’ అని కోహ్లి తెలిపాడు. అనుష్కతో కలిసి కోహ్లి.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫెదరర్‌ను కలిసిన కోహ్లీ ఆ ఫొటోను షేర్ చేస్తూ ఆనందాన్ని పంచుకున్నాడు.