BD-W vs IN-W: బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టు చేతిలో చిత్తుగా ఓడిన భారత మహిళా క్రికెట్ టీమ్

మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టులో నిగర్ సుల్తానా 39, ఫర్గానా 27 పరుగులతో రాణించారు.

BD-W vs IN-W: బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టు చేతిలో చిత్తుగా ఓడిన భారత మహిళా క్రికెట్ టీమ్

Bangladesh Women

Updated On : July 16, 2023 / 5:55 PM IST

BD-W vs IN-W: బంగ్లాదేశ్ (Bangladesh) మహిళా క్రికెట్ జట్టు చేతిలో భారత (India) మహిళా క్రికెట్ టీమ్ ఓడిపోయింది. బంగ్లాదేశ్‌లోని ఢాకా షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో ఇవాళ తొలి వన్డే జరిగింది.

మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టులో నిగర్ సుల్తానా 39, ఫర్గానా 27 పరుగులతో రాణించారు. వర్షం పడడంతో 44 ఓవర్లకు కుదించిన మ్యాచులో బంగ్లాదేశ్ మహిళా జట్టు 35.5 ఓవర్లు ఆడి 152 పరుగులకే ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో టీమిండియా మహిళల జట్టులో దీప్తి శర్మ చేసిన 20 పరుగులే అత్యధిక స్కోరు.

యస్తికా భాటికా 15 పరుగులు, అమన్‌జ్యోత్ కౌర్ 15, స్మృతి మంధాన 11 పరుగులు మాత్రమే చేశారు. మిగతా బ్యాటర్ల స్కోరు కనీసం పది పరుగులు కూడా దాటలేదు. దీంతో భారత్ 35.5 ఓవర్లకు 113 పరుగులకే ఆలౌట్ అయింది. భారత మహిళల జట్టుపై బంగ్లాదేశ్ మహిళల జట్టు 40 పరుగుల తేడాతో గెలిచింది. మిగతా రెండు వన్డేలు జులై 19, జులై 22న జరగనున్నాయి.

Rinku Singh: నేను ఇండియన్ జెర్సీని ధరించడం చూసి.. నాకంటే వాళ్లే ఎక్కువ సంతోషిస్తారు.. ఆ రోజు వారికి అంకితం అవుతుంది