Concussion Protocols : కంకషన్‌కు గురైతే 7 రోజులు దూరం.. ఐసీసీ కొత్త నిబంధ‌న‌లు.. ఆట‌గాళ్ల‌తో పాటు జ‌ట్ల‌కు బిగ్ షాక్‌..!

క్రికెట్‌లో అప్పుడప్పుడు బ్యాట‌ర్లు కంక‌ష‌న్‌కు గురి అవ్వ‌డాన్ని చూస్తూనే ఉంటాం.

Concussion Protocols : కంకషన్‌కు గురైతే 7 రోజులు దూరం.. ఐసీసీ కొత్త నిబంధ‌న‌లు.. ఆట‌గాళ్ల‌తో పాటు జ‌ట్ల‌కు బిగ్ షాక్‌..!

concussion protocols ICC said there are two changes

Updated On : June 28, 2025 / 10:45 AM IST

క్రికెట్‌లో అప్పుడప్పుడు బ్యాట‌ర్లు కంక‌ష‌న్‌కు గురి అవ్వ‌డాన్ని చూస్తూనే ఉంటాం. ఓ ఆట‌గాడు కంక‌ష‌న్‌కు గురి అయితే అత‌డి స్థానంలో మ‌రో ఆట‌గాడు మ్యాచ్ ఆడొచ్చు. ఈ నిబంధ‌న మంచిదే అయినా కొన్ని సంద‌ర్భాల్లో జ‌ట్లు త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటున్నాయి.

2014లో ఆస్ట్రేలియా బ్యాట‌ర్ ఫిల్ హ్యూస్ త‌ల‌కు బంతి త‌గ‌ల‌డంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘ‌ట‌న త‌రువాత కంక‌ష‌న్ నిబంధ‌న‌ను ఐసీసీ తీసుకువ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నిబంధ‌న ప్ర‌కారం.. బంతి త‌గిలి లేదా మ‌రో ర‌కంగా ఆట‌గాడు గాయ‌ప‌డి త‌ల‌తిరుగుతుంటే వెంట‌నే అత్య‌వ‌స‌ర చికిత్స అందించ‌డం, స‌ద‌రు ఆట‌గాడు ఆట‌ను కొన‌సాగించ‌లేని ప‌రిస్థితుల్లో ప్ర‌త్యామ్నాయ ప్లేయ‌ర్‌ను ఎంచుకునే అవ‌కాశాన్ని జ‌ట్టుకు క‌ల్పిస్తూ ఉంటుంది.

ICC : టీ20ల్లో కొత్త రూల్‌.. ఇక పై ఓవ‌ర్లు కాదు.. బంతులే లెక్క‌..

దీంతో కొన్ని జ‌ట్లు కంక‌ష‌న్ పేరు చెప్పి మ‌రో ఆట‌గాడిని ఆడిస్తూ వ‌స్తున్నాయి. ఇక కంక‌ష‌న్‌కు గురైన ఆట‌గాడిని వెంట‌నే త‌దుప‌రి మ్యాచ్‌లో ఆడిస్తోంది. దీనికి అడ్డు క‌ట్ట ప‌డ‌నుంది.

కొత్త నిబంధ‌నలు ఇదే..
ఇక పై కంక‌ష‌న్‌కు గురైన ఆట‌గాడు ఖ‌చ్చితంగా 7 రోజుల పాటు మైదానానికి దూరంగా ఉండాల‌ని ఐసీసీ తెలిపింది. దీని వ‌ల్ల ఆట‌గాళ్ల భ‌ద్ర‌త‌తో పాటు జ‌ట్టు పొందే ఆయాచిత ప్ర‌యోజ‌నాన్ని అడ్డుక‌ట్ట వేయ‌వ‌చ్చున‌ని ఐసీసీ భావ‌న‌. ఇక మ్యాచ్ కు ముందు ప్ర‌తి జ‌ట్టు కూడా ఇద్ద‌రు చొప్పున కంక‌ష‌న్ స‌బ్‌స్టిట్యూట్ ప్లేయ‌ర్ ను ప్ర‌క‌టించాల్సి ఉంటుంది. మూడు పార్మాట్ల‌కు ఈ నియ‌మం వ‌ర్తిస్తుంద‌ని ఐసీసీ తెలిపింది.