Hardik Natasa Wedding: మరోసారి పెళ్లి చేసుకుంటున్న క్రికెటర్ హార్ధిక్ పాండ్యా..! మూడు రోజులు పెళ్లి వేడుకలు
టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక పాండ్యా మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాడు. సోమవారం నుంచి మూడు రోజులపాటు పెళ్లి వేడుకలు అంగరంగవైభంగా జరగనున్నాయి. ఇందుకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికైంది.

Hardik Pandya And Natasa
Hardik Natasa Wedding: టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక పాండ్యా మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాడు. సోమవారం నుంచి మూడు రోజులపాటు పెళ్లి వేడుకలు అంగరంగవైభంగా జరగనున్నాయి. ఇందుకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికైంది. అదేంటి పాండ్యాకు పెళ్లైంది కదా..? మళ్లీ పెళ్లి ఏంటి అనుకుంటున్నారా? పాండ్యా పెళ్లిచేసుకొనేది మరెవరినో కాదు.. అతని భార్యనే. అయితే, ఓ కుమారుడు జన్మించిన తరువాతకూడా వీరికి మళ్లీ పెళ్లేంటి అని డౌట్ రావొచ్చు.. ఈ జంట మరోసారి పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకోవటం వెనుక ఓ స్టోరీకూడా ఉందట.

Hardik pandya, Natasha wedding
హార్ధిక్ పాండ్యా టీమిండియా క్రికెటర్‌గా అందరికీ సుపరిచితమే. అతని భార్య నటాషా స్టాంకోవిచ్ నటి, మోడల్. వీరు 20220 జనవరి 21న నిశ్చితార్ధం చేసుకున్నారు. 2020 మే 31న కోర్టు వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. జూలై 2020లో వీరికి బాబు జన్మించాడు. తాజాగా వీరు హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ని ఎంచుకకున్నారు. ఇక్కడ ఫిబ్రవరి 13 నుంచి మూడు రోజులు పెళ్లి తంతు కొనసాగనుంది. పసుపు, మెహందీ సహా ఇతర కార్యక్రమాలు కూడా ఉంటాయి. అయితే ఫిబ్రవరి 14న వీరి వివాహం జరగనుంది.

Hardik pandya, Natasha wedding
హార్ధిక్ పాండ్యా, నటాషా ఇద్దరూ సెలబ్రెటీలు కావటంతో పెళ్లికి బాలీవుడ్ స్టార్లు, క్రికెటర్లు హాజరుకానున్నారు. నటాషా 2013లో సత్రాగ్రహం చిత్రం ద్వారా బాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించి పాపులర్ అయింది. బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్లోనూ నటాషా కనిపించింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నటాషా.. వారి కుమారుడికి సంబంధించిన వీడియోలను అభిమానులతో పంచుకుంటుంది.