IPL 2022: సీఎస్కే యువ క్రికెటర్‌కు చిక్కులు తప్పవా..

టీమిండియా 2018 అండర్-19 స్టార్ ప్లేయర్ మంజోత్ కల్రాపై వచ్చినట్లే మరో ప్లేయర్ వయస్సుపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంజోత్ కు ఈ మోసం గురించి జరిగిన విచారణలో రెండేళ్ల పాటు నిషేదాన్ని...

IPL 2022: సీఎస్కే యువ క్రికెటర్‌కు చిక్కులు తప్పవా..

Csk Player

Updated On : February 19, 2022 / 12:08 PM IST

IPL 2022: టీమిండియా 2018 అండర్-19 స్టార్ ప్లేయర్ మంజోత్ కల్రాపై వచ్చినట్లే మరో ప్లేయర్ వయస్సుపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంజోత్ కు ఈ మోసం గురించి జరిగిన విచారణలో రెండేళ్ల పాటు నిషేదాన్ని ఎదుర్కొన్నాడు. రీసెంట్ గా చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసిన రాజవర్ధన్ హంగర్గేకర్ పై మహారాష్ట్ర స్పోర్ట్స్ కమిషనర్ ఆరోపణలు గుప్పించారు.

ఫిర్యాదు ఫైల్ చేస్తూ.. బీసీసీఐకి కంప్లైంట్ కూడా చేశాడు. స్పోర్ట్స్ అండ్ యూత్ డెవలప్మెంట్ కమిషనర్ ఓం ప్రకాశ్ బకోరియా బీసీసీఐకి రాసిన లెటర్ లో ఫాస్ట్ బౌలర్ హంగర్గేకర్ మోసానికి పాల్పడ్డాడంటూ తన వద్ద సాక్ష్యాలున్నాయని ఆరోపిస్తున్నాడు.

రిపోర్టుల ప్రకారం.. హంగర్గేకర్ అసలు వయస్సు 21. అతని ఎనిమిదో తరగతి సర్టిఫికేట్ లో అది తెలుస్తుంది. 2001 జనవరి 10న పుట్టగా దానిని 2002 నవంబర్ 10కి మార్పించుకున్నాడు. అలా జరగడం వల్ల అండర్-19 వరల్డ్ కప్ ఆడాడు. ఫైనల్ లో ఇంగ్లాండ్ పై గెలిచిన ఇండియా ఎట్టకేలకు విజయం సాధించింది.

IPL 2022: 19ఏళ్ల రాజవర్ధన్‌కు రూ.1.5కోట్లు వెచ్చించిన సీఎస్కే

అండర్-19 వరల్డ్ కప్ లో హంగర్గేకర్ ఆరు మ్యాచ్ లు ఆడి ఐదు వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్ తో ఇంప్రెస్ చేసిన పేసర్ ను కొనుగోలు చేసేందుకు ఐపీఎల్ 2022 వేలంలో మంచి డిమాండ్ కనిపించింది. చెన్నై సూపర్ కింగ్స్ తో పాటు మరో రెండు జట్లు పోటీపడగా రూ.1.5కోట్లకే ధోనీ జట్టు కొనుగోలు చేసింది.