CSKvsMI: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై

ఐపీఎల్ 2019లో భాగంగా ధోనీ సేన.. రోహిత్ జట్ల మధ్య చిదంబరం స్టేడియం వేదికగా మ్యాచ్ జరుగుతుంది. లీగ్‌లో జరుగుతోన్న 44వ మ్యాచ్‌లో చెన్నై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ధోనీ ఈ మ్యాచ్ కు అందుబాటులో లేకపోవడంతో రైనా కెప్టెన్సీ వహించనున్నాడు. ఈ సీజన్‌లో ఇదే వేదికగా తొలి మ్యాచ్ జరిగింది. ఆ గేమ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును చెన్నై ఘోరంగా కట్టడి చేసింది. ఫలితంగా ఆర్సీబీ కేవలం 70పరుగులకే చాప చుట్టేసింది.
మరోసారి చెన్నై.. అదే దూకుడు చూపించాలని ముంబైతో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. టాస్ అనంతరం మాట్లాడిన చెన్నై కెప్టెన్ రైనా.. టాస్ గెలిచి ముందు బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. మహేంద్ర సింగ్ ధోనీ.. రవీంద్ర జడేజాలు అనారోగ్యంగా ఉండడంతో జట్టులో మార్పులు చోటు చేసుకున్నాయి. వారిద్దరితో పాటు డుప్లెసిస్ కూడా జట్టుకు దూరమైయ్యాడు. దీంతో ధ్రువ్ శోరే, మురళీ విజయ్, శాంతర్‌లు ఆడనున్నారు.
ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. టాస్ గెలిస్తే.. మేం కూడా ఫీల్డింగే ఎంచుకోవాలనుకున్నాం. జట్టులో ప్రధానంగా 2మార్పులు చేశాం. బెన్ కటింగ్, మయాంక్ మార్కండేకు బదులుగా ఎవిన్ లూయీస్, అనుకుల్ రాయ్‌లు ఆడనున్నారు.
Mumbai Indians: Quinton de Kock(w), Evin Lewis, Rohit Sharma(c), Suryakumar Yadav, Hardik Pandya, Kieron Pollard, Krunal Pandya, Anukul Roy, Rahul Chahar, Lasith Malinga, Jasprit Bumrah
Chennai Super Kings: Shane Watson, Murali Vijay, Suresh Raina(c), Ambati Rayudu(w), Dhruv Shorey, Kedar Jadhav, Dwayne Bravo, Mitchell Santner, Deepak Chahar, Harbhajan Singh, Imran Tahir
The @ChennaiIPL win the toss and elect to bowl first against the @mipaltan #CSKvMI pic.twitter.com/a4Un17kV7Q
— IndianPremierLeague (@IPL) April 26, 2019