Dhruv Jurel : అచ్చం ధోనిలాగానే ధ్రువ్ జురెల్ ? ప్లాన్ చేసి బుట్టలో వేసి.. వీడియో వైరల్
వికెట్ల వెనక ఉండి బ్యాటర్ల కదలికలను పసిగట్టి, బౌలర్లకు సలహాలు ఇస్తూ ప్రత్యర్థి ఆటగాళ్లను ఔట్ చేయడంలో టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని దిట్ట అన్న సంగతి తెలిసిందే.

Dhruv Jurel's MS Dhoni Moment In Planning Ollie Pope's Dismissal
Dhruv Jurel – MS Dhoni : వికెట్ల వెనక ఉండి బ్యాటర్ల కదలికలను పసిగట్టి, బౌలర్లకు సలహాలు ఇస్తూ ప్రత్యర్థి ఆటగాళ్లను ఔట్ చేయడంలో టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని దిట్ట అన్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌తో ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ చేసిన పని ధోనిని గుర్తుకు తెచ్చింది. ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు ఓలీ పోప్‌ను సరిగ్గా అంచనా వేసిన జురెల్ అతడు బంతిని ఆడేందుకు ముందు వస్తాడని బౌలర్‌కు సూచించాడు.
తొలి రోజు ఆటలో లంచ్ విరామానికి ముందు 26వ ఓవర్ వేసే బాధ్యతను కుల్దీప్‌యాదవ్‌కు అప్పగించాడు కెప్టెన్ రోహిత్ శర్మ. మొదటి బంతికి జాక్‌క్రాలే సింగిల్ తీయడంతో పోప్ స్ట్రైకింగ్‌కు వచ్చాడు. రెండో బంతికి పోప్ ఢిపెన్స్ ఆడటానికి ప్రయత్నించగా అది మిస్సై వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ చేతుల్లో పడింది. వెంటనే జురెల్ స్టంప్స్ వెనుక నుంచి అరిచాడు. అతడు డిఫెన్స్ ఆడడానికి క్రీజు దాటి బయటకు వస్తాడు అని చెప్పాడు.
దీంతో కుల్దీప్ యాదవ్ మూడో బంతిని ప్లైట్ డెలివరీగా వేసి పోప్‌ను బోల్తా కొట్టించాడు. పోప్ డిఫెన్స్ ఆడేందుకు ముందుకు రాగా.. బంతి కాస్త ఎక్కువగా టర్న్ అయి వికెట్ కీపర్ జురెల్ చేతుల్లోకి వెళ్లగా వెంటనే అతడు స్టంప్స్‌ను పడగొట్టాడు. దీంతో పోప్ స్టంపౌట్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ధోనిలానే బ్యాటర్లను జురెల్ సరిగ్గా అంచనా వేస్తున్నాడని, ఇందుకు పోప్‌ను ఔట్ చేయడమే నిదర్శనమని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
కాగా.. మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ శర్మ (103), శుభ్‌మన్ గిల్ (110) లు సెంచరీలతో చెలరేగడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 79 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 356 పరుగులు చేసింది. దేవ్‌దత్ పడిక్కల్ (37), సర్ఫరాజ్ ఖాన్ (43) లు క్రీజులో ఉన్నారు. టీమ్ఇండియా ప్రస్తుతం 138 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Rohit Sharma : చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో 50 సిక్సర్లు
Kuldeep sends Pope packing with a Jaffa ??
India get their second wicket at the stroke of Lunch ?#IDFCFirstBankTestSeries #BazBowled #INDvENG #JioCinemaSports pic.twitter.com/gQWM3XYEEg
— JioCinema (@JioCinema) March 7, 2024