Joe Root : భారత్‌తో టెస్టు సిరీస్.. జోరూట్‌ను ఊరిస్తున్న రికార్డులు ఇవే..
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మరో నాలుగు రోజుల్లో 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మరో నాలుగు రోజుల్లో 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ముందు ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జో రూట్‌ను పలు రికార్డులు ఊరిస్తున్నాయి.
జోరూట్ ఇప్పటి వరకు 153 టెస్టులు ఆడాడు. 50.80 సగటుతో 13,006 పరుగులు చేశాడు. ఇందులో 36 శతకాలు, 65 అర్థశతకాలు ఉన్నాయి. టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ (15,921 పరుగులు) రికార్డును బ్రేక్ చేసే అవకాశం సమీప భవిష్యత్‌లో రూట్ కు మాత్రమే ఉంది.
Faf du Plessis : టీ20 క్రికెట్‌లో ఎలైట్ లిస్ట్‌లో చోటు సంపాదించిన డుప్లెసిస్..
373 పరుగులు చేస్తే..
భారత్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో రూట్ గనుక 373 పరుగులు చేస్తే సుధీర్ఘ ఫార్మాట్‌లో ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్‌ను అధిగమిస్తాడు. పాంటింగ్ తన కెరీర్‌లో 168 టెస్టు మ్యాచ్‌ల్లో 51.85 సగటుతో 13,378 పరుగులు చేశాడు. రూట్ ఇప్పటి వరకు 13006 పరుగులు చేశాడు.
ద్రవిడ్‌ను అధిగమించే ఛాన్స్..
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో అత్యధిక సగటు రాహుల్ ద్రవిడ్ పేరిట ఉంది. ద్రవిడ్ 60.93సగటును నమోదు చేశాడు. ఆ తరువాత జోరూట్ యావరేజ్ 58.55గా ఉంది. ఈ సిరీస్‌లో రూట్ ఒకటి లేదా రెండు శతకాలు బాదితే ద్రవిడ్ ను బీట్ చేసే అవకాశం ఉంది.
Ravichandran Ashwin : రవిచంద్రన్ అశ్విన్ పై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు..
కాగా.. ఈ రెండు రికార్డులు జోరూట్ సులభంగా అందుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అతడికి స్వదేశంలో భారత్ పై మంచి రికార్డు ఉంది. హోం కండిషన్స్‌లో రూట్ 15 టెస్టులు ఆడాడు. 25 ఇన్నింగ్స్‌ల్లో 74.95 సగటుతో 1574 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.