ఐదో టెస్టులో విజయంపై గౌతమ్ గంభీర్ రియాక్షన్ మామూలుగా లేదు..! ‘కానీ, ఎప్పటికీ లొంగిపోము’ అంటూ ఇచ్చిపడేశాడు..

ఓవల్‌లో భారత జట్టు విజయం సాధించిన వెంటనే గౌతం గంభీర్ మైదానంలోకి వచ్చాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను ముద్దులతో ముంచెత్తాడు. జట్టు సభ్యులను భావోద్వేగంతో ఆలింగనం చేసుకున్నాడు.

ఐదో టెస్టులో విజయంపై గౌతమ్ గంభీర్ రియాక్షన్ మామూలుగా లేదు..! ‘కానీ, ఎప్పటికీ లొంగిపోము’ అంటూ ఇచ్చిపడేశాడు..

Gautam Gambhir

Updated On : August 5, 2025 / 8:20 AM IST

IND vs ENG Gautam Gambhir: ఓవల్‌లో భారత జట్టు అద్భుతం సృష్టించింది. ఐదో టెస్టులో టీమిండియా ఫాస్ట్ బౌలర్ సిరాజ్, ప్రసిద్ధ్‌లు బంతితో నిప్పులు చెరగడంతో భారత జట్టు చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. చివరిరోజు 35 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవాల్సి ఉండగా సిరాజ్ మ్యాజిక్ చేశాడు. ఇంగ్లాండ్ చేతిలో నాలుగు వికెట్లు ఉండగా.. మూడు వికెట్లు తీశాడు. మరో వికెట్ ను ప్రసిద్ద్ పడగొట్టాడు. దీంతో ఓవల్ మైదానంలో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది.


ఈ విజయంతో భారత జట్టు ఇంగ్లాండ్ టూర్‌లో ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఓవల్ టెస్ట్ విజయం తరువాత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ లోని చిన్నపిల్లాడు బయటికి వచ్చాడు. విజయగర్వంతో ఊగిపోతూ ఎగిరి గంతులేశాడు.


ఓవల్‌లో భారత జట్టు విజయం సాధించిన వెంటనే గౌతం గంభీర్ మైదానంలోకి వచ్చాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను ముద్దులతో ముంచెత్తాడు. జట్టు సభ్యులను భావోద్వేగంతో ఆలింగనం చేసుకున్నాడు. ముఖ్యంగా సిరాజ్ పై గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతన్ని కెప్టెన్‌తో పాటు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కూర్చోబెట్టి కొత్త ఆనవాయితీకి తెరలేపాడు.


ఇంగ్లాండ్ సిరీస్ ఆధ్యాంతం టీమిండియా చూపించిన పోరాటస్ఫూర్తిలో గంభీర్ ప్రధానపాత్ర పోషించాడని చెప్పొచ్చు. చివరి నిమిషం వరకు జట్టు విజయంపై ఆశలు వదులుకోకుండా ఆటగాళ్లలో కసిని రగిల్చాడు. అయితే, మ్యాచ్ అనంతరం గంభీర్ తన ‘ఎక్స్’ ఖాతాలో ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘కొన్ని గెలుస్తాం.. కొన్ని ఓడతాం.. కానీ, ఎప్పటికీ లొంగిపోము.. వెల్‌డన్ బాయ్స్’ అంటూ గంభీర్ ఓ కదిలించే పోస్టు పెట్టాడు.