Sai Sudharsan : గుజ‌రాత్ టైటాన్స్‌కు షాక్‌.. ఆస్ప‌త్రి బెడ్ పై ఐపీఎల్ స్టార్ ప్లేయ‌ర్‌.. షాక్‌లో ఫ్యాన్స్‌..!

ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వ‌చ్చిన ఆట‌గాళ్ల‌లో సాయి సుద‌ర్శ‌న్ ఒక‌డు.

Sai Sudharsan : గుజ‌రాత్ టైటాన్స్‌కు షాక్‌.. ఆస్ప‌త్రి బెడ్ పై ఐపీఎల్ స్టార్ ప్లేయ‌ర్‌.. షాక్‌లో ఫ్యాన్స్‌..!

Gujarat Titans player Sai Sudharsan hospitalized

Updated On : December 10, 2024 / 3:46 PM IST

ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వ‌చ్చిన ఆట‌గాళ్ల‌లో సాయి సుద‌ర్శ‌న్ ఒక‌డు. ఈ యువ ఆట‌గాడు ఐపీఎల్‌లో గుజ‌రాత్ టైటాన్స్ కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. తాజాగా ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట‌ర్ ఆస్ప‌త్రి బెడ్ పై ఉన్న ఫోటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. త‌న‌కు శ‌స్త్ర చికిత్స జ‌రిగిన‌ట్లుగా చెప్పుకొచ్చాడు. ప్ర‌స్తుతం తాను క్షేమంగానే ఉన్నట్లుగా తెలిపాడు.

అయితే.. అత‌డు ఎందుకు శ‌స్త్ర‌చికిత్స చేయించుకున్నాడు అనే విష‌యం మాత్రం తెలియ‌రాలేదు. నాకు శ‌స్త్రచికిత్స చేసిన వైద్యులు, చేయించిన బీసీసీఐకి, అండ‌గా నిలిచిన గుజ‌రాత్ టైటాన్స్ ఫ్యామిలీకి కృత‌జ్ఞ‌త‌లు అంటూ సాయి సుద‌ర్శ‌న్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. త్వ‌ర‌లోనే తాను బ‌లంగా తిరిగి వ‌స్తాన‌ని తెలిపాడు.

IND vs AUS : ఇదేం పిచ్చిరా అయ్యా.. ఇంకా 15 రోజులు ఉండ‌గానే.. ఫ‌స్ట్ డే టికెట్లు సోల్డ్‌..

కాగా.. ఈ విష‌యం తెలిసిన అత‌డి అభిమానుల‌తో పాటు గుజ‌రాత్ టైటాన్స్ ఫ్యాన్స్ అత‌డు తొంద‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటున్నారు.

IND vs AUS : బ్రిస్బేన్ టెస్టు కోసం అడిలైడ్‌లోనే ప్రాక్టీస్ మొద‌లుపెట్టిన భార‌త్‌.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ

ఐపీఎల్‌లో ఈ యువ ఆట‌గాడు ఇప్ప‌టి వ‌ర‌కు 25 మ్యాచులు ఆడాడు. 47 స‌గ‌టుతో 1034 ప‌రుగులు చేశాడు. ఇందులో ఓ సెంచ‌రీ, 6 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోరు 103. కాగా.. ఈ యువ ఆట‌గాడిని గుజ‌రాత్ టైటాన్స్ ఐపీఎల్ మెగా వేలం 2025 ముందు 8.50 కోట్ల‌కు రిటైన్ చేసుకుంది.

 

View this post on Instagram

 

A post shared by Sai Sudharsan (@sais_1509)