IND vs AUS : బ్రిస్బేన్ టెస్టు కోసం అడిలైడ్‌లోనే ప్రాక్టీస్ మొదలుపెట్టిన భారత్.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ
ఈ నేపథ్యంలో ఈ కీలక టెస్టు మ్యాచ్ కోసం భారత్ సన్నద్ధం అవుతోంది. అడిలైడ్ మైదానంలో ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Team India Preparations for the Brisbane Test starts in Adelaide
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్టులో విజయం సాధించిన భారత్ పింక్ బాల్ టెస్టులో ఘోర పరాజయం పాలైంది. దీంతో ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఈ క్రమంలో కీలకమైన మూడో టెస్టు మ్యాచ్ బ్రిస్బేన్ వేదికగా డిసెంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ కీలక టెస్టు మ్యాచ్ కోసం భారత్ సన్నద్ధం అవుతోంది. అడిలైడ్ మైదానంలో ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
అడిలైడ్ టెస్టు మూడు రోజుల్లోనే ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో మరో రెండు రోజుల పాటు భారత్ అడిలైడ్‌లోనే ఉండనుంది. ఈ క్రమంలో సమయం వృథా చేయకుండా మూడో టెస్టు కోసం భారత జట్టు ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ పోస్ట్ చేసింది. ఇందులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ వంటి ఆటగాళ్లు తీవ్రంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు.
మూడో టెస్టులో గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని భారత్ పట్టుదలగా ఉంది.
డబ్యూటీసీ ఫైనల్‌లో అవకాశాలు ఎలా ఉన్నాయంటే..?
వరుసగా మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలనే భారత ఆశలు నెరవేరడం కాస్త కష్టంగా మారింది. ఓ దశలో వరుస విజయాలతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి ఈజీగా ఫైనల్ చేరేలా కనిపించిన భారత్, ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. గత 5 మ్యాచుల్లో నాలుగింట ఓటమి పాలై ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
ప్రస్తుతం 57.29 విజయశాతంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా భారత్ ఫైనల్ చేరుకోవాలంటే ఆసీస్‌తో మిగిలిన మూడు టెస్టుల్లో విజయం సాధించాల్సి ఉంది. అసలు ఓడిపోకూడదు. కనీసం రెండు గెలవాల్సి ఉంటుంది. 4-1తో గెలిస్తే 64.05 శాతం, 3-1తో విజయం సాధిస్తే 60.52 విజయశాతంతో ఫైనల్‌కు చేరే అవకాశం ఉంది. ఒకవేళ బోర్డర్ గవాస్కర్ సిరీస్ 2-2తో సమం అయినా అవకాశం ఉంటుంది. అప్పుడు ఆస్ట్రేలియాను శ్రీలంక 2-0 తేడాతో ఓడించాల్సి ఉంటుంది.
It is time to look ahead.
Preparations for the Brisbane Test starts right here in Adelaide.#TeamIndia #AUSvIND pic.twitter.com/VfWphBK6pe
— BCCI (@BCCI) December 10, 2024