తొలిసారి జోడీగా బరిలోకి దిగనున్న పాండ్యా బ్రదర్స్

తొలిసారి జోడీగా బరిలోకి దిగనున్న పాండ్యా బ్రదర్స్

Updated On : June 23, 2021 / 4:21 PM IST

ఎన్నాళ్లుగానో కన్న కల.. పాండ్యా బ్రదర్స్ జీవితంలో నెరవేరబోతోంది. న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లో హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా కలిసి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. వీరిద్దరూ ఇప్పటికే అంతర్జాతీయ మ్యాచ్‌లలో అరంగ్రేటం చేసినప్పటికీ కలిసి ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడలేదు. బుధవారం నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్‌ల్లో పాండ్యా బద్రర్స్‌ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇదే జరిగేతే వీరిద్దరూ.. అమర్‌నాథ్‌ బ్రదర్స్‌(మొహిందర్ అమర్‌నాథ్, సురేందర్ అమర్‌నాథ్), పఠాన్‌ బ్రదర్స్‌(ఇర్పాన్ పఠాన్, యూసఫ్ పఠాన్)ల సరసన చేరనున్నారు.

ఈ అమర్‌నాథ్ బ్రదర్స్ తండ్రి భారత్‌ తరఫున తొలి టెస్ట్‌ సెంచరీ సాధించిన ఘనత సాధించాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ సందర్భంగానే ఈ ఆల్‌రౌండర్‌ బ్రదర్స్‌ కలిసి బరిలో దిగాల్సి ఉండగా.. కృనాల్‌కు తుది జట్టులో అవకాశం లభించలేదు. అనంతరం స్వదేశంలో వెస్టిండీస్‌ జరిగిన మ్యాచ్‌ ద్వారా కృనాల్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. ఆ సమయంలో పాండ్యా గాయంతో జట్టుకు దూరమవడంతో అప్పుడు కుదరలేదు. ఇలా వీరిద్దరూ కలిసి బరిలోకి దిగే అవకాశమే రాలేదు.