Ravi Shastri : ప్ర‌పంచ‌క‌ప్ త‌రువాత అత‌డే కెప్టెన్.. రోహిత్ ఇక చాలు

వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌లో టీమ్ఇండియా రెండు టెస్టులు, మూడు వ‌న్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడ‌నుంది. వ‌న్డే జ‌ట్టుకు ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యాను వైస్ కెప్టెన్‌గా నియ‌మించింది.

Ravi Shastri : ప్ర‌పంచ‌క‌ప్ త‌రువాత అత‌డే కెప్టెన్.. రోహిత్ ఇక చాలు

Ravi Shastri on captaincy

Ravi Shastri on captaincy : వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌లో టీమ్ఇండియా రెండు టెస్టులు, మూడు వ‌న్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడ‌నుంది. జూలై 12 నుంచి టెస్టు సిరీస్, జూలై 27 నుంచి వ‌న్డే సిరీస్‌, ఆగ‌స్టు 3 నుంచి టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలో టెస్టు, వ‌న్డే జ‌ట్టును బీసీసీఐ ప్ర‌క‌టించింది. వ‌న్డే జ‌ట్టుకు ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) ను వైస్ కెప్టెన్‌గా నియ‌మించింది.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2022లో భార‌త జ‌ట్టు ఓడిపోయిన త‌రువాత నుంచి టీ20ల్లో భార‌త జ‌ట్టుకు హార్దిక్ పాండ్యానే సార‌థ్యం వ‌హిస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో స్వ‌దేశంలో జ‌రిగే ప్ర‌పంచ క‌ప్ త‌రువాత వ‌న్డేల్లోనూ హార్దిక్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం ఉన్న‌ట్లు టీమ్ఇండియా మాజీ హెడ్ కోచ్ ర‌విశాస్త్రి (Ravi Shastri) అన్నాడు. రోహిత్ శ‌ర్మ టెస్టు కెప్టెన్సీకే ప‌రిమితం అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌న్నాడు.

CWC Qualifier 2023 : వెస్టిండీస్‌కు వ‌రుస షాక్‌లు.. జింబాబ్వే చేతిలో ఓట‌మి.. ఐసీసీ జ‌రిమానా

హార్ధిక్ శ‌రీరం టెస్టు క్రికెట్ కు స‌హ‌క‌రించ‌డం లేద‌ని, ప్ర‌పంచ క‌ప్ త‌రువాత అత‌డు ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌కు పూర్తి స్థాయి కెప్టెన్‌గా మారాల‌ని తాను బావిస్తున్నట్లు శాస్త్రి తెలిపాడు. వ‌న్డే ప్ర‌పంచ క‌ప్‌కు మాత్రం రోహిత్ శ‌ర్మనే సార‌థిగా ఉండాల‌ని, అందులో ఎవ్వ‌రికి ఎటువంటి సందేహం అక్క‌ర‌లేద‌న్నాడు. రోహిత్ మంచి కెప్టెన్ అన్న సంగ‌తి గుర్తుంచుకోవాల‌న్నాడు. అయితే.. మూడు ఫార్మాట్ల‌లో జ‌ట్టును న‌డిపించ‌డం అంత సుల‌భ‌మైన విష‌యం కాద‌ని, తీవ్ర ఒత్తిడి ఉంటుంద‌న్నాడు. ఇది రోహిత్ వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న‌పై ప్ర‌భావం చూపిస్తోంద‌ని చెప్పాడు.

Ishant Sharma : నీ సైజ్‌కు త‌గ్గ షార్ట్స్ కొనుక్కో.. కోహ్లిని తొలిసారి క‌లిసిన‌ప్పుడు..

విరాట్ కోహ్లి నుంచి సార‌థ్య బాధ్య‌త‌లు అందుకున్న రోహిత్ శ‌ర్మ సైతం ఐసీసీ టోర్నీల్లో టీమ్ఇండియాను విజేత‌గా నిల‌ప‌డంలో విఫ‌లం అయ్యాడు. అత‌డి కెప్టెన్సీలో ఆసియాకప్‌, టీ20 ప్రపంచకప్‌-2022, డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమ్ఇండియా ఓడిపోయింది. దీంతో అత‌డిని కెప్టెన్సీ నుంచి త‌ప్పించాల‌ని ప‌లువురు మాజీల ఆట‌గాళ్లు బీసీసీఐకి సూచ‌న‌లు చేస్తున్నారు. దీనిపై ర‌విశాస్త్రి స్పందిస్తూ హార్దిక్‌కు కెప్టెన్సీ అప్ప‌గించాల‌న్నాడు.