IND vs BAN : ఉత్కంఠ‌ పోరులో బంగ్లాదేశ్ విజ‌యం

ఆసియా క‌ప్ 2023లో ఇప్ప‌టికే టీమ్ఇండియా ఫైన‌ల్‌కు చేరిన సంగ‌తి తెలిసిందే. బంగ్లాదేశ్‌తో నామ‌మాత్ర‌పు మ్యాచ్‌కు సిద్ధ‌మైంది.

IND vs BAN : ఉత్కంఠ‌ పోరులో బంగ్లాదేశ్ విజ‌యం

IND vs BAN

Updated On : September 15, 2023 / 11:07 PM IST

ఆసియా క‌ప్ 2023లో ఇప్ప‌టికే టీమ్ఇండియా ఫైన‌ల్‌కు చేరిన సంగ‌తి తెలిసిందే. బంగ్లాదేశ్‌తో నామ‌మాత్ర‌పు మ్యాచ్‌కు సిద్ధ‌మైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. తెలుగు కుర్రాడు తిల‌క్ వ‌ర్మ ఈ మ్యాచ్ ద్వారా వ‌న్డేల్లో అరంగ్రేటం చేస్తున్నాడు.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 15 Sep 2023 11:07 PM (IST)

    ఓడిన‌ టీమ్ఇండియా

    నామ‌మాత్ర‌మైన మ్యాచ్‌లో టీమ్ఇండియా (Team India) ఓడిపోయింది. కొలంబో వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచ్ లో భార‌త్ 6 ప‌రుగుల తేడాతో ఓట‌మి చ‌విచూసింది. 266 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్ నిర్ణీత 49.5 ఓవ‌ర్ల‌లో 259 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

  • 15 Sep 2023 10:30 PM (IST)

    శుభ్‌మ‌న్ గిల్ ఔట్‌

    కీల‌క స‌మ‌యంలో శుభ్‌మ‌న్ గిల్ (121; 133 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) ఔట్ అయ్యాడు. మహేదీ హసన్ బౌలింగ్‌లో(47.4వ ఓవ‌ర్‌) తౌహిద్ హృదయ్ చేతికి చిక్కాడు. 44 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 210/7. అక్ష‌ర్ పటేల్ (11), శార్దూల్ ఠాకూర్ (1) క్రీజులో ఉన్నారు.

  • 15 Sep 2023 10:03 PM (IST)

    శుభ్‌మ‌న్ గిల్ సెంచ‌రీ

    తాంజిమ్ హసన్ సాకిబ్ బౌలింగ్‌లో (38.2వ ఓవ‌ర్‌)లో రెండు ప‌రుగులు తీసి శుభ్‌మ‌న్ గిల్ 117 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స‌ర్ల సాయంతో శ‌త‌కాన్ని అందుకున్నాడు. 39 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 183/6. శుభ్‌మ‌న్ గిల్ (109), అక్ష‌ర్ ప‌టేల్‌(2) లు క్రీజులో ఉన్నారు.

  • 15 Sep 2023 09:37 PM (IST)

    సూర్య‌కుమార్ యాద‌వ్ క్లీన్ బౌల్డ్‌..

    షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో (32.4వ ఓవ‌ర్‌)లో సూర్య‌కుమార్ యాద‌వ్ (26; 34 బంతుల్లో 3ఫోర్లు)క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 139 ప‌రుగుల వ‌ద్ద భార‌త్ ఐదో వికెట్ కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. 33 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 141/5 శుభ్‌మ‌న్ గిల్ (75), ర‌వీంద్ర జ‌డేజా(1) లు క్రీజులో ఉన్నారు.

  • 15 Sep 2023 08:55 PM (IST)

    ఇషాన్ కిష‌న్ ఔట్‌..

    భార‌త్ మ‌రో వికెట్ కోల్పోయింది. మెహిదీ హసన్ బౌలింగ్‌లో (23.3వ ఓవ‌ర్‌) ఇషాన్ కిష‌న్ (5; 15 బంతుల్లో) ఎల్బీడ‌బ్ల్యూగా ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 94 ప‌రుగుల వ‌ద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. 24 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 98/4. శుభ్‌మ‌న్ గిల్ (54), సూర్య‌కుమార్ యాద‌వ్‌(4) లు క్రీజులో ఉన్నారు.

  • 15 Sep 2023 08:48 PM (IST)

    సిక్స్‌తో గిల్ అర్థ‌శ‌త‌కం

    మహేదీ హసన్ బౌలింగ్‌లో (19.6వ ఓవ‌ర్‌) బౌలింగ్‌లో సిక్స్‌తో శుభ్‌మ‌న్ గిల్ 61 బంతుల్లో అర్థ‌శ‌త‌కాన్ని అందుకున్నాడు. 20 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 89/3. శుభ్‌మ‌న్ గిల్‌(54), ఇషాన్ కిష‌న్ (3) లు క్రీజులో ఉన్నారు.

  • 15 Sep 2023 08:37 PM (IST)

    కేఎల్ రాహుల్ ఔట్‌..

    మహేదీ హసన్ బౌలింగ్‌లో (17.1వ ఓవ‌ర్‌) కేఎల్ రాహుల్ (19; 39 బంతుల్లో 2 ఫోర్లు) షమీమ్ హొస్సేన్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 74 ప‌రుగుల వ‌ద్ద మూడో వికెట్ కోల్పోయింది. 18 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 74/3. శుభ్‌మ‌న్ గిల్‌(42), ఇషాన్ కిష‌న్ (0) లు క్రీజులో ఉన్నారు.

  • 15 Sep 2023 08:25 PM (IST)

    నిల‌క‌డ‌గా ఆడుతున్న రాహుల్‌, గిల్‌

    భార‌త బ్యాట‌ర్లు నిల‌క‌డ‌గా ఆడుతున్నారు. ముస్తాఫిజుర్ రెహ్మన్ వేసిన 15వ ఓవ‌ర్‌లో 6 ప‌రుగులు వ‌చ్చాయి. 15 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 71/2. కేఎల్ రాహుల్ (17), శుభ్‌మ‌న్ గిల్‌(41)లు క్రీజులో ఉన్నారు.

  • 15 Sep 2023 07:29 PM (IST)

    తిల‌క్ వ‌ర్మ క్లీన్ బౌల్డ్

    భార‌త్ కు వ‌రుస షాకులు త‌గిలాయి. అరంగ్రేట మ్యాచులో తిల‌క్ వ‌ర్మ విఫ‌లం అయ్యాడు. 9 బంతులు ఎదుర్కొన్న తిల‌క్ ఓ ఫోర్ కొట్టి 5 ప‌రుగులు మాత్ర‌మే చేసి తాంజిమ్ హసన్ సాకిబ్ బౌలింగ్‌లో (2.4వ ఓవ‌ర్‌)లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో భార‌త్ 17 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది. 3 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 17/2. కేఎల్ రాహుల్ (0), శుభ్‌మ‌న్ గిల్‌(9)లు క్రీజులో ఉన్నారు.

  • 15 Sep 2023 07:25 PM (IST)

    రెండో బంతికే రోహిత్ డ‌కౌట్‌

    266 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్‌కు మొద‌టి ఓవ‌ర్‌లోనే షాక్ త‌గిలింది. ఫామ్‌లో ఉన్న కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (0; 2 బంతుల్లో) తాంజిమ్ హసన్ సాకిబ్ బౌలింగ్‌లో (0.2వ ఓవ‌ర్‌) అనముల్ చేతికి చిక్కాడు. దీంతో భార‌త్ ప‌రుగుల ఖాతా తెర‌వ‌క‌ముందే రోహిత్ వికెట్‌ను కోల్పోయింది. 1 ఓవ‌ర్‌కు భార‌త స్కోరు 3/1. తిల‌క్ వ‌ర్మ (0), శుభ్‌మ‌న్ గిల్‌(0)లు క్రీజులో ఉన్నారు.

  • 15 Sep 2023 06:42 PM (IST)

    టీమ్ఇండియా ల‌క్ష్యం 266

    టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 265 ప‌రుగులు చేసింది. బంగ్లాదేశ్ బ్యాట‌ర్ల‌లో ష‌కీల్ అల్ హ‌స‌న్ (80; 85 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), తౌహిద్ హృదయ్ (54; 81 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) రాణించగా నసుమ్ అహ్మద్(44; 45 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స‌ర్) ప‌ర్వాలేద‌నిపించాడు. శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు తీయ‌గా, మ‌హ్మ‌ద్ ష‌మీ రెండు, అక్ష‌ర్ ప‌టేల్‌, ర‌వీంద్ర జ‌డేజా, ప్రసిద్ కృష్ణ లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

  • 15 Sep 2023 06:30 PM (IST)

    నసుమ్ అహ్మద్ ఔట్‌..

    బంగ్లాదేశ్ మ‌రో వికెట్ కోల్పోయింది. ప్ర‌సిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో (47.2వ ఓవ‌ర్‌) నసుమ్ అహ్మద్ (44; 45 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స‌ర్) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో బంగ్లాదేశ్ 238 ప‌రుగుల వ‌ద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 48 ఓవ‌ర్ల‌కు బంగ్లాదేశ్ స్కోరు 242/8.

  • 15 Sep 2023 06:13 PM (IST)

    తౌహిద్ హృదయ్ ఔట్‌..

    మ‌హ్మ‌ద్ ష‌మీ బౌలింగ్‌లో(41.2వ ఓవ‌ర్‌) తౌహిద్ హృదయ్ (54; 81 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) తిల‌క్ వ‌ర్మ చేతికి చిక్కాడు. దీంతో బంగ్లాదేశ్ 193 ప‌రుగుల వ‌ద్ద ఏడో వికెట్ కోల్పోయింది. 42 ఓవ‌ర్లకు బంగ్లాదేశ్ స్కోరు 197/7. నసుమ్ అహ్మద్(18), మహేదీ హసన్ (4) క్రీజులో ఉన్నారు.

  • 15 Sep 2023 05:40 PM (IST)

    స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో రెండు వికెట్లు

    బంగ్లాదేశ్ జ‌ట్టు స్వల్ప వ్య‌వ‌ధిలో రెండు వికెట్లు కోల్పోయింది. శత‌కం దిశ‌గా సాగుతున్న ష‌కీల్ అల్ హ‌స‌న్ (80; 85 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స‌ర్లు)ను శార్దూల్ ఠాకూర్ (33.1వ ఓవ‌ర్‌)క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ మ‌రుస‌టి ఓవ‌ర్ తొలి బంతికే (34.1వ ఓవ‌ర్‌) షమీమ్ హొస్సేన్ (1; 5 బంతుల్లో) జ‌డేజా ఎల్భీగా ఔట్ చేశాడు. దీంతో 161 ప‌రుగుల‌కే ఆరు వికెట్లు కోల్పోయి బంగ్లాదేశ్ క‌ష్టాల్లో ప‌డింది. 35 ఓవ‌ర్ల‌కు బంగ్లాదేశ్ స్కోరు 162/6. తౌహిద్ హృదయ్(40), నసుమ్ అహ్మద్(1) క్రీజులో ఉన్నారు.

  • 15 Sep 2023 04:57 PM (IST)

    ష‌కీబ్ అర్థ‌శ‌త‌కం..

    అక్ష‌ర్ ప‌టేల్ బౌలింగ్‌లో (25.4వ ఓవ‌ర్‌) సిక్స్‌తో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ 65 బంతుల్లో అర్థ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. వ‌న్డేల్లో అత‌డికి ఇది 55వ హాఫ్ సెంచ‌రీ. 26 ఓవ‌ర్ల‌కు బంగ్లాదేశ్ స్కోరు 129/4 షకీబ్ అల్ హసన్ (60), తౌహిద్ హృదయ్(25) క్రీజులో ఉన్నారు.

  • 15 Sep 2023 04:18 PM (IST)

    మెహిదీ హసన్ మిరాజ్..

    బంగ్లాదేశ్ మ‌రో వికెట్ కోల్పోయింది. అక్ష‌ర్ ప‌టేల్ బౌలింగ్‌లో(13.6వ ఓవ‌ర్‌) రోహిత్ శ‌ర్మ క్యాచ్ ప‌ట్టుకోవ‌డంతో మెహిదీ హసన్ మిరాజ్ (13; 28 బంతుల్లో 1ఫోర్‌) ఔట్ అయ్యాడు. దీంతో బంగ్లాదేశ్ 59 ప‌రుగుల వ‌ద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. 14 ఓవ‌ర్ల‌కు బంగ్లాదేశ్ స్కోరు 59/4. షకీబ్ అల్ హసన్ (20), తౌహిద్ హృదయ్(0) క్రీజులో ఉన్నారు.

  • 15 Sep 2023 03:37 PM (IST)

    అనముల్ హక్ ఔట్‌..

    టీమ్ ఇండియా బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బంతులు వేస్తున్నారు. దీంతో బంగ్లాదేశ్ వ‌రుస‌గా వికెట్లు కోల్పోతుంది. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో (5.4వ ఓవ‌ర్) అనముల్ హక్ (4; 11 బంతుల్లో 1ఫోర్) కేఎల్ రాహుల్ చేతికి చిక్కాడు. దీంతో బంగ్లాదేశ్ 28 ప‌రుగుల వ‌ద్ద మూడో వికెట్ కోల్పోయింది. 6 ఓవ‌ర్ల‌కు బంగ్లాదేశ్ స్కోరు 29/3. షకీబ్ అల్ హసన్ (9), మెహిదీ హసన్ మిరాజ్ (1) క్రీజులో ఉన్నారు.

  • 15 Sep 2023 03:22 PM (IST)

    తాంజిద్ హసన్ క్లీన్ బౌల్డ్‌

    బంగ్లాదేశ్ మ‌రో వికెట్ కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో (3.1వ ఓవ‌ర్‌) తాంజిద్ హసన్(13; 12 బంతుల్లో 3 ఫోర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో బంగ్లాదేశ్ 15 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది.

  • 15 Sep 2023 03:18 PM (IST)

    లిట‌న్ దాస్ క్లీన్ బౌల్డ్‌

    టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు ఆరంభంలోనే గ‌ట్టి షాక్ త‌గిలింది. సీనియ‌ర్ ఆట‌గాడు మ‌హ్మ‌ద్ ష‌మీ బౌలింగ్‌(2.1వ ఓవ‌ర్‌)లో లిట‌న్ దాస్ (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో బంగ్లాదేశ్ 13 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది. 3 ఓవ‌ర్ల‌కు బంగ్లాదేశ్ స్కోరు 15/1. అనముల్ హక్ (0), తాంజిద్ హసన్ (13) క్రీజులో ఉన్నారు.

  • 15 Sep 2023 03:05 PM (IST)

    బంగ్లాదేశ్ తుది జ‌ట్టు

    లిట‌న్‌ దాస్(వికెట్ కీప‌ర్‌), తాంజిద్ హసన్, అనముల్ హక్, షకీబ్ అల్ హసన్(కెప్టెన్‌), తౌహిద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, మహేదీ హసన్, నసుమ్ అహ్మద్, తంజిమ్ హసన్ సాకిబ్, ముస్తాఫిజుర్ రెహమాన్

  • 15 Sep 2023 03:03 PM (IST)

    భారత తుది జ‌ట్టు

    రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్(వికెట్ కీప‌ర్), ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మ‌హ్మ‌ద్‌ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ

  • 15 Sep 2023 03:02 PM (IST)

    టాస్ గెలిచిన భార‌త్‌..

    బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న మ్యాచులో టీమ్ఇండియ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ చేయ‌నుంది.