IND vs ENG : వారినాయనో.. హర్షిత్ రాణా వికెట్ తీసిన ప్రతీసారి గంభీర్ సెలబ్రేషన్స్ నెక్ట్స్ లెవెల్.. ఎంతైనా కేకేఆర్ ఆటగాడే కదా!
హర్షిత్ రాణా వికెట్ తీసిన సందర్భంలో గంభీర్ సెలబ్రేషన్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

IND vs ENG 4th T20 Gautam Gambhir Celebrations next level As Harshit Rana Shines On T20I Debut
పూణే వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో ఓడిపోయే స్థితిలోంచి సంచలన విజయాన్ని సాధించింది భారత్. తొలుత బ్యాటింగ్ చేసేటప్పుడు 12 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. హార్దిక్ పాండ్యా (53), శివమ్ దూబె (53)హాఫ్ సెంచరీలకు తోడు రింకూ సింగ్ (30), అభిషేక్ శర్మ (29)లు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది టీమ్ఇండియా. ఇంగ్లాండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్ మూడు వికెట్లు పడగొట్టాడు. జామీ ఓవర్టన్ రెండు వికెట్లు తీశాడు. బ్రైడన్ కార్సే, ఆదిల్ రషీద్ చెరో వికెట్ సాధించారు.
ఆ తరువాత అనూహ్య రీతిలో టీ20ల్లోకి అరంగేట్రం చేసిన హర్షిత్ రాణా.. అసాధారణ బౌలింగ్ ప్రదర్శన చేశాడు. నాలుగు ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఇంగ్లాండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 15 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్ (26 బంతుల్లో 51 పరుగులు) రాణించాడు. భారత బౌలర్లో హర్షిత్ తో పాటు రవి బిష్ణోయ్ మూడు వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్‌లు చెరో వికెట్ సాధించారు.
Harshit Rana-க்கு சிறப்பான ஒரு Debut கிடைச்சுருச்சு 👏🥳
📺 தொடர்ந்து காணுங்கள் | India vs England | 4th T20I | Disney+Hotstar & Star Sports தமிழில்#INDvENGonJioStar pic.twitter.com/kJxyJioCKV
— Star Sports Tamil (@StarSportsTamil) January 31, 2025
కంకషన్ సబ్‌గా హర్షిత్..
వాస్తవానికి ఈ మ్యాచ్ తుది జట్టులో హర్షిత్ రాణా లేడు. భారత బ్యాటింగ్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో జేమి ఓవర్టన్ బౌలింగ్‌లో ఓ బంతి బ్యాటర్ శివమ్ దూబె తలను తాకింది. వెంటనే ఫిజియో వచ్చి అతడిని పరీక్షించగా అంతా బాగుందని చెప్పి బ్యాటింగ్ కొనసాగించాడు. ఈ ఓవర్‌లోని ఆఖరి బంతికి రనౌట్ అయ్యాడు. ఇక భారత బౌలింగ్ సందర్భంగా ఫీల్డింగ్‌కు రాలేదు. రెండు ఓవర్ల తరువాత కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా హర్షిత్ రాణా వచ్చాడు.
Gautam gambhir X Harshit rana pic.twitter.com/F0CYll4k01
— Name cannot be blank (@Quickadii) January 31, 2025
ఐసీసీ నిబంధనల ప్రకారం ఓ ఆటగాడు కంకషన్‌కు గురి అయితే.. మరోఆటగాడిని కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగవచ్చు. అయితే.. బ్యాటర్ స్థానంలో బ్యాటర్, బౌలర్ స్థానంలో బౌలర్, ఆల్‌రౌండర్ స్థానంలో ఆల్‌రౌండర్‌ను తీసుకోవచ్చు. అయితే.. ఏదైన జట్టు కంకషన్ సబ్‌ను కోరితే.. మ్యాచ్ రిఫరీ దీనిపై నిర్ణయం తీసుకుంటాడు. అతడిదే తుది నిర్ణయం. ఈ నిర్ణయం పై ప్రశ్నించేందుకు ప్రత్యర్థి జట్టుకు ఎలాంటి అవకాశం గానీ, హక్కు గానీ ఉండదు.
ఆనందంలో గంభీర్..
కంకషన్ సబ్‌గా బరిలోకి దిగిన హర్షిత్ రాణా కీలక ఆటగాళ్లు అయిన లియామ్ లివింగ్ స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్‌టన్‌ల వికెట్లు తీశాడు. తన తొలి టీ20 మ్యాచులోనే కీలక వికెట్లు పడగొట్టడంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక హర్షిత్ వికెట్ తీసిన ప్రతీసారి టీమ్ఇండియా హెడ్ కోచ్ గంభీర్ సంబురాలు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఐపీఎల్ 2024 విజేతగా కోల్‌కతా నైట్ రైడర్స్ నిలిచిన సంగతి తెలిసిందే. ఆ జట్టు విజయం సాధిచండంలో మెంటార్ గౌతమ్ గంభీర్ ప్రధాన పాత్ర పోషించాడు. ఇక కోల్‌కతా తరుపున హర్షిత్ రాణా ప్రధాన పేసర్‌గా ఆడాడు. ఈ క్రమంలో హర్షిత్ సామర్థ్యం పై గంభీర్‌కు ఓ స్పష్టమైన అంచనా ఉంది. ఈ క్రమంలోనే అతడిని భారత జట్టులోకి తీసుకువచ్చాడనే విమర్శలు గంభీర్ పై వచ్చాయి. ఇక ఎట్టకేలకు హర్షిత్ అంతర్జాతీయ టీ20ల్లో అద్భుత ప్రదర్శన చేయడంతో గంభీర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.