IND vs NZ 2nd T20 : టాస్ గెలిచిన భారత్.. న్యూజిలాండ్ బ్యాటింగ్.. అక్షర్ ఔట్, బుమ్రాకు రెస్ట్.. కుల్దీప్, హర్షిత్‌కు చోటు..
రాయ్‌పూర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ (IND vs NZ ) ప్రారంభమైంది.
IND vs NZ 2nd T20 : రాయ్‌పూర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేయనుంది.
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టీ20లో ఘన విజయం సాధించినా భారత్ నేటి మ్యాచ్‌లోనూ గెలుపొంది సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లాలని భావిస్తోంది. అదే సమయంలో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని కివీస్ ఆరాటపడుతోంది.
‘మేము ముందుగా బౌలింగ్ చేయబోతున్నాం. ఇప్పటికే మంచు కురుస్తోంది. ఇటీవలి కాలంలో మేము ఛేజ్ చేయలేదు, కాబట్టి మేము ఛేజ్ చేయాలనుకుంటున్నాము. ప్రతి మ్యాచ్‌లో మెరుగుపడేందుకు ప్రయత్నిస్తాము. జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. అక్షర్ పటేల్ గాయం నుంచి కోలుకోలేదు. బుమ్రాకి విశ్రాంతి ఇచ్చాము. వారిద్దరి స్థానాల్లో హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ లు జట్టులోకి వచ్చారు. ‘అని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.
🚨 Toss 🚨#TeamIndia have won the toss and elected to bowl first in the 2⃣nd T20I.
Updates ▶️ https://t.co/8G8p1tq1RC#INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/AcBcPlcKFZ
— BCCI (@BCCI) January 23, 2026
‘టాస్ గెలిస్తే మేము కూడా బౌలింగ్ చేసేవాళ్లం. నాణ్యమైన జట్టుతో వారికి అనుకూలమైన పరిస్థితుల్లో ఆడేటప్పుడు మీరు తప్పకుండా ఏదో ఒకటి నేర్చుకుంటారు. తుది జట్టులో మూడు మార్పులు చేశాము. రాబిన్సన్ స్థానంలో సీఫెర్ట్ వచ్చాడు. క్లార్క్ స్థానంలో ఫౌల్క్స్ వచ్చాడు, మాట్ హెన్రీ కూడా వచ్చాడు. ‘అని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ తెలిపాడు.
భారత తుది జట్టు..
సంజు శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్‌కు ముందు న్యూజిలాండ్ కు భారీ షాక్..
#TeamIndia‘s Playing XI for the 2️⃣nd T20I 🙌
Updates ▶️ https://t.co/8G8p1tq1RC#INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/8lSHilY59v
— BCCI (@BCCI) January 23, 2026
న్యూజిలాండ్ తుది జట్టు..
డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), జకారీ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, ఇష్ సోధి, జాకబ్ డఫీ
