IND vs SL : శ్రీలంకపై గెలిచిన టీమ్ఇండియా
ఆసియా కప్ 2023లో సూపర్-4 దశలో శ్రీలంక జట్టుతో భారత్ తలపడింది.

IND vs SL
ఆసియా కప్ 2023లో సూపర్-4 దశలో శ్రీలంక జట్టుతో భారత్ తలపడింది.
LIVE NEWS & UPDATES
-
41 పరుగులతో భారత్ విజయం
214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 41.3 ఓవర్లలో 172 పరుగులకు కుప్పకూలింది. దీంతో భారత్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది.
-
ధనంజయ డిసిల్వా ఔట్..
శ్రీలంక మరో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా బౌలింగ్ లో (37.3వ ఓవర్) ధనంజయ డిసిల్వా (41; 66 బంతుల్లో 5 ఫోర్లు) గిల్ చేతికి చిక్కాడు. దీంతో శ్రీలంక 162 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది.
-
శనక ఔట్..
రవీంద్ర జడేజా బౌలింగ్ లో రోహిత్ శర్మ క్యాచ్ పట్టుకోవడంతో ధసున్ శనక (9; 13 బంతుల్లో 1ఫోర్) ఔట్ అయ్యాడు. దీంతో శ్రీలంక 99 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 26 ఓవర్లకు లంక స్కోరు 104/ 6. ధనంజయ డిసిల్వా (22), దునిత్ వెల్లలగే (1) క్రీజులో ఉన్నారు.
-
చరిత్ అసలంక ఔట్
శ్రీలంక మరో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో (19.2వ ఓవర్) చరిత్ అసలంక (22; 35 బంతుల్లో 2ఫోర్లు) కేఎల్ రాహుల్ చేతికి చిక్కాడు. దీంతో 73 పరుగుల వద్ద లంక ఐదో వికెట్ కోల్పోయింది. 20 ఓవర్లకు లంక స్కోరు 79/5. ధనంజయ డిసిల్వా (6), దాసున్ శనక(5) లు క్రీజులో ఉన్నారు.
-
సదీర సమరవిక్రమ ఔట్..
శ్రీలంక మరో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో సదీర సమరవిక్రమ (17; 31 బంతుల్లో 1ఫోర్) స్టంపౌట్ అయ్యాడు. దీంతో 68 పరుగుల వద్ద లంక నాలుగో వికెట్ కోల్పోయింది. 18 ఓవర్లకు లంక స్కోరు 69/4. చరిత్ అసలంక (22), ధనంజయ డిసిల్వా (1) లు క్రీజులో ఉన్నారు.
-
నిలకడగా ఆడుతున్న లంక బ్యాటర్లు
సదీర సమరవిక్రమ (13), చరిత్ అసలంక(10) లు నిలకడగా ఆడుతన్నారు. వీరిద్దరు జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. 14 ఓవర్లకు శ్రీలంక స్కోరు 52/3.
-
దిముత్ కరుణరత్నే ఔట్
భారత పేసర్ల ధాటికి శ్రీలంక వరుసగా వికెట్లు కోల్పోతుంది. మహ్మద్ సిరాజ్ (7.1వ ఓవర్) బౌలింగ్ లో దిముత్ కరుణరత్నే (2) గిల్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో 25 పరుగుల వద్ద లంక మూడో వికెట్ కోల్పోయింది. 8 ఓవర్లకు లంక స్కోరు 26/3. సదీర సమరవిక్రమ (0), చరిత్ అసలంక(0) లు క్రీజులో ఉన్నారు.
-
కుశాల్ మెండీస్ ఔట్
శ్రీలంక మరో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్ లో(6.4వ ఓవర్) కుశాల్ మెండీస్ (15; 16బంతుల్లో 3ఫోర్లు) సూర్యకుమార్ చేతికి చిక్కాడు. దీంతో 25 పరుగుల వద్ద లంక రెండో వికెట్ కోల్పోయింది. 7 ఓవర్లకు లంక స్కోరు 25/2. దిముత్ కరుణరత్నే (2), సదీర సమరవిక్రమ (0) లు క్రీజులో ఉన్నారు.
-
నిస్సాంక ఔట్
ఓ మోస్తారు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంకకు షాక్ తగిలింది. బుమ్రా బౌలింగ్ (2.1వ ఓవర్)లో పాతుమ్ నిస్సంక (6 7 బంతుల్లో 1 ఫోర్) కేఎల్ రాహుల్ చేతికి చిక్కాడు. దీంతో లంక 7 పరుగులకే మొదటి వికెట్ కోల్పోయింది. 3 ఓవర్లకు లంక స్కోరు 7 1. కుశాల్ మెండీస్ (0), దిముత్ కరుణరత్నే (0) లు క్రీజులో ఉన్నారు.
-
శ్రీలంక టార్గెట్ 214
బ్యాటర్లు విఫలం కావడంతో కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ తక్కువ పరుగులకే ఆలౌటైంది. లంక బౌలర్ల ధాటికి 49.1 ఓవర్లలో 213 పరుగులకే కుప్పకూలింది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ (53; 48 బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్సర్లు) అర్థశతకంతో రాణించగా కేఎల్ రాహుల్ (39), ఇషాన్ కిషన్ (33)లు ఫర్వాలేదనిపించారు. విరాట్ కోహ్లీ(3), శుభ్ మన్ గిల్ (19), హార్దిక్ పాండ్య (5), రవీంద్ర జడేజా (4)లు విఫలం కావడంతో తక్కువ స్కోరుకే టీమ్ఇండియా పరిమితమైంది. శ్రీలంక బౌలర్లలో దునిత్ వెల్లలాగే ఐదు వికెట్లతో భారత పతనాన్ని శాసించగా చరిత అసలంక నాలుగు, మహేశ్ తీక్షణ ఓ వికెట్ పడగొట్టాడు.
-
తగ్గిన వర్షం..
వరుణుడు శాంతించాడు. సిబ్బంది కవర్లు తొలగించారు. అంపైర్లు మైదానాన్ని పరిశీలించారు. 7.15 గంటలకు మ్యాచ్ పున: ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. ఈ లోపు సిబ్బంది మైదానాన్ని సిద్దం చేయనున్నారు.
-
వర్షం పడుతోంది
అనుకున్నట్లుగానే వరుణుడు వచ్చేశాడు. భారత ఇన్నింగ్స్ లో 47 ఓవర్లు పూర్తి కాగానే వర్షం మొదలైంది. దీంతో అంఫైర్లు మ్యాచ్ ను నిలిపివేశాడు. సిబ్భంది మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత స్కోరు 197/9. అక్షర్ పటేల్ (15), మహ్మద్ సిరాజ్ (2) క్రీజులో ఉన్నారు.
-
జడేజా ఔట్
భారత్ వరుసగా వికెట్లు కోల్పోతుంది. అసలంక బౌలింగ్ లో (38.5వ ఓవర్) జడేజా (4; 19 బంతుల్లో) కుశాల్ మెండీస్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 178 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది.
-
హార్ధిక్ పాండ్య ఔట్
వెల్లలాగే బౌలింగ్ లో (35.6వ ఓవర్)లో కుశాల్ మెండీస్ చేతికి చిక్కాడు హార్దిక్ ఫాండ్య (5; 18 బంతుల్లో). దీంతో భారత్ 172 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. 36 ఓవర్లకు భారత స్కోరు 172/6. హార్దిక్ పాండ్య (5), రవీంద్ర జడేజా (2) లు క్రీజులో ఉన్నారు.
-
ఇషాన్ కిషన్ ఔట్..
భారత్ మరో వికెట్ కోల్పోయింది. అసలంక బౌలింగ్ లో(34.2వ ఓవర్) వెల్లలాగే క్యాచ్ అందుకోవడంతో ఇషాన్ కిషన్ (33; 61 బంతుల్లో 1ఫోర్, 1సిక్స్) పెవిలియన్ కు చేరుకున్నాడు. దీంతో భారత్ 171 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది.
-
కేఎల్ రాహుల్ ఔట్..
టీమ్ఇండియా మరో వికెట్ కోల్పోయింది. వెల్లలాగే బౌలింగ్ లో (29.6వ ఓవర్)లో అతడికే క్యాచ్ ఇచ్చి కేఎల్ రాహుల్ (39; 44 బంతుల్లో 2 ఫోర్లు) ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 154 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. 30 ఓవర్లకు భారత స్కోరు 154/4. ఇషాన్ కిషన్ (23), హార్దిక్ పాండ్య (0) లు క్రీజులో ఉన్నారు.
-
కట్టుదిట్టంగా శ్రీలంక బౌలింగ్..
శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేస్తున్నారు. దీంతో పరుగుల వేగం నెమ్మదించింది. గత నాలుగు ఓవర్లలో 11 పరుగులు మాత్రమే వచ్చాయి. 23 ఓవర్లకు భారత స్కోరు 118/3. ఇషాన్ కిషన్ (16), కేఎల్ రాహుల్ (10) లు క్రీజులో ఉన్నారు.
-
రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్..
భారత్ కు స్వల్ప వ్యవధిలో రెండు భారీ షాకులు తగిలాయి. వెల్లలాగే బౌలింగ్ లో (15.1వ ఓవర్)లో రోహిత్ శర్మ(53; 48 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో భారత్ 91 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. 16 ఓవర్లకు భారత స్కోరు 93/3. ఇషాన్ కిషన్ (1), కేఎల్ రాహుల్ (1) లు క్రీజులో ఉన్నారు.
-
విరాట్ కోహ్లీ ఔట్..
టీమ్ ఇండియాకు భారీ షాక్ తగిలింది. విరాట్ కోహ్లీ (3) ఔట్ అయ్యాడు. వెల్లలాగే వేసిన 13.5వ ఓవర్ లో శనక చేతికి చిక్కాడు. దీంతో భారత్ 90 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
-
నిలకడగా ఆడుతున్న భారత ఓపెనర్లు
ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ లు బరిలోకి దిగారు. పిచ్ బౌలింగ్ కు సహకరిస్తుండడంతో వీరిద్దరు ఆచితూచి ఆడుతున్నారు. 5 ఓవర్లకు భారత స్కోరు 25/0. రోహిత్ శర్మ (12), శుభ్‌మన్ గిల్ (12)లు క్రీజులో ఉన్నారు.
-
శ్రీలంక తుది జట్టు
పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, మతీషా పతిరనా
-
భారత తుది జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
-
టాస్ గెలిచిన ఇండియా
శ్రీలంకతో జరుగుతున్న మ్యాచులో రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.