IND VS WI 5th T20 : మ్యాచ్‌కు మళ్లీ వర్షం అంతరాయం.. UPDATES in Telugu
సిరీస్ ఫలితాన్ని తేల్చే కీలక పోరుకు భారత్, వెస్టిండీస్ జట్లు సిద్దమయ్యాయి. ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ వేదికగా ఇరు జట్లు ఐదో టీ20 మ్యాచులో తలపడుతున్నాడు. టాస్ గెలిచిన టీమ్ఇండియా కెప్టెన్ హార్థిక్ పాండ్య బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

IND VS WI 5th T20
మ్యాచ్‌కు మళ్లీ వర్షం అంతరాయం
మ్యాచ్‌కు మళ్లీ వర్షం అంతరాయం కలిగింది. దీంతో పిచ్‌ను కవర్లతో కప్పేశారు. మ్యాచ్ ఆగే సమయానికి వెస్టిండీస్ స్కోరు 12.3 ఓవర్లలో 117/1. బ్రాండన్ కింగ్ (54), నికోలస్ పూరన్(46) క్రీజులో ఉన్నారు. విండీస్ విజయానికి 45 బంతుల్లో 49 పరుగులు అవసరం. డక్త్ వర్త్ లూయిస్ పద్దతిలో ఈ సమయానికి వెస్టిండీస్ 91 పరుగులు చేయాల్సి ఉండగా ఇంకా ఎక్కువ పరుగులే చేసింది. ఒకవేళ మ్యాచ్ ఇక్కడితో ఆపేస్తే వెస్టిండీస్ విజేతగా నిలుస్తుంది.
బ్రాండన్ కింగ్ అర్థశతకం
చాహల్ బౌలింగ్‌లో(12.3వ ఓవర్) సిక్స్‌తో బ్రాండన్ కింగ్ 38 బంతుల్లో 54 పరుగులు 4 ఫోర్లు, 3 సిక్సర్లు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
పవర్ ప్లే పూర్తి..
వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో పవర్ ప్లే ముగిసింది. 6 ఓవర్లకు విండీస్ స్కోరు 61/1. నికోలస్ పూరన్(20), బ్రాండన్ కింగ్(29) పరుగులతో క్రీజులో ఉన్నారు.
మేయర్స్ ఔట్
భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు విండీస్ ఓపెనర్లు బరిలోకి దిగారు. హార్థిక్ పాండ్య వేసిన తొలి ఓవర్‌లో ఓ సిక్స్, ఫోర్ కొట్టి కైల్ మేయర్స్ తన ఉద్దేశాన్ని చాటి చెప్పాడు. అయితే.. అతడికి అర్ష్‌దీప్ సింగ్ చెక్ పెట్టాడు. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో(1.2వ ఓవర్) జైస్వాల్ క్యాచ్ అందుకోవడంతో మేయర్స్(10) ఔట్ అయ్యాడు. దీంతో వెస్టిండీస్ 12 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది.
వెస్టిండీస్ టార్గెట్ 166
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. టీమ్ఇండియా బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (61; 45 బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించగా తిలక్ వర్మ (27; 18 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు. యశస్వి జైస్వాల్(5), శుభ్‌మన్ గిల్(9), సంజు శాంసన్(13), పాండ్య (14)లు విఫలం కావడంతో ఓ మోస్తరు స్కోరుకే భారత్ పరిమితమైంది. వెస్టిండీస్ బౌలర్లలో షెపర్డ్ నాలుగు వికెట్లు తీయగా, అకేల్ హోసేన్, జేసన్ హోల్డర్ చెరో రెండు వికెట్లు, రోస్టన్ ఛేజ్ ఓ వికెట్ తీశాడు.
మొదలైన ఆట.. హార్దిక్ పాండ్య ఔట్
వరుణుడు తెరిపి ఇవ్వడంతో మ్యాచ్ మొదలైంది. ఆట తిరిగి ప్రారంభమైన కాసేపటికే హార్థిక్ పాండ్య(14) ఔట్ అయ్యాడు. షెపర్డ్ బౌలింగ్‌లో(16.2వ ఓవర్)లో జేసన్ హోల్డర్ క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో భారత్ 130 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది.
వరుణుడి ఆటంకం. నిలిచిన ఆట
మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. వర్షం వస్తుండడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. మైదాన సిబ్బంది పిచ్ పై కవర్లను కప్పారు. వర్షం వల్ల మ్యాచ్ నిలిచే సమయానికి భారత్ స్కోరు 15.5 ఓవర్లలో 121/4. సూర్యకుమార్ యాదవ్ (53), పాండ్య (8) క్రీజులో ఉన్నారు.
సిక్సర్‌తో సూర్య కుమార్ అర్థశతకం
అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో(15.1వ ఓవర్‌లో) సూర్యకుమార్ యాదవ్ సిక్స్ కొట్టి 38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు
మళ్లీ నిరాశ పరిచిన సంజు శాంసన్
వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో సంజు శాంసన్ (13) విఫలం అవుతున్నాడు. షెపర్డ్ బౌలింగ్‌లో(10.2వ ఓవర్) పూరన్ క్యాచ్ పట్టుకోవడంతో శాంసన్ ఔట్ అయ్యాడు. దీంతో 87 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది.
తిలక్ వర్మ ఔట్..
దూకుడుగా ఆడుతున్న తిలక్ వర్మ(27) ఔట్ అయ్యాడు. రోస్టన్ ఛేజ్ బౌలింగ్‌లో (7.5వ ఓవర్)లో అతడికే క్యాచ్ ఇచ్చి తిలక్ పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో భారత్ 66 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.
పవర్ ప్లే పూర్తి..
భారత ఇన్నింగ్స్‌లో పవర్ ప్లే ముగిసింది. 6 ఓవర్లకు భారత స్కోరు 51/2. తిలక్ వర్మ 10 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 20 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 13 బంతుల్లో 1ఫోర్, 1 సిక్స్‌తో 15 పరుగులతో క్రీజులో ఉన్నారు.
శుభ్‌మన్ గిల్ ఔట్..
టీమ్ఇండియా మరో వికెట్ కోల్పోయింది. గత మ్యాచ్‌లో అర్థశతకం చేసి ఫామ్‌లోకి వచ్చిన శుభ్‌మన్ గిల్ (9) ఎల్భీగా ఔట్ అయ్యాడు. అకేల్ హోసేన్ కే ఈ వికెట్ కూడా దక్కింది. భారత్ 17 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయింది.
యశస్వి ఔట్..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు మొదటి ఓవర్‌లోనే గట్టి షాక్ తగిలింది. గత మ్యాచ్‌లో అర్థశతకంతో ఆకట్టుకున్న యశస్వి జైశ్వాల్ (5) తొలి ఓవర్‌లోనే ఔట్ అయ్యాడు. అకేల్ హోసేన్ బౌలింగ్‌లో(0.5వ ఓవర్) అతడికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో భారత్ 6 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది.
వెస్టిండీస్ తుది జట్టు: బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, షాయ్ హోప్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్(కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, రోస్టన్ చేజ్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్
భారత తుది జట్టు : యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సంజు శాంసన్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్
సిరీస్ ఫలితాన్ని తేల్చే కీలక పోరుకు భారత్, వెస్టిండీస్ జట్లు సిద్దమయ్యాయి. ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ వేదికగా ఇరు జట్లు ఐదో టీ20 మ్యాచులో తలపడుతున్నాడు. టాస్ గెలిచిన టీమ్ఇండియా కెప్టెన్ హార్థిక్ పాండ్య బ్యాటింగ్ ఎంచుకున్నాడు.