Ind vs Eng: సెంచరీతో ఆదుకున్న గిల్.. ఇంగ్లాండ్ ముందు టార్గెట్ ఎంతుందో తెలుసా?

రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 17, గిల్ 104, శ్రేయస్ అయ్యర్ 29, అక్షర్ 45, అశ్విన్ 29 పరుగులు చేశారు.

Ind vs Eng: సెంచరీతో ఆదుకున్న గిల్.. ఇంగ్లాండ్ ముందు టార్గెట్ ఎంతుందో తెలుసా?

ASHWIN

Updated On : February 4, 2024 / 5:44 PM IST

విశాఖపట్నంలో జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్‌ రెండో టెస్టు మ్యాచ్‌ మూడో రోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌‌లో టీమిండియా 396 (ఆలౌట్) పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఓవర్‌ నైట్‌ స్కోరు 28/0 స్కోరుతో టీమిండియా మూడో రోజు ఆటను ప్రారంభించింది.

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌‌లో 255 (ఆలౌట్) పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌‌లో 253 (ఆలౌట్), రెండో ఇన్నింగ్స్‌‌లో ఆటముగిసే సమయానికి 14 ఓవర్లలో 67/1 స్కోరు చేసింది. ప్రస్తుతం క్రీజులో జాక్‌ క్రాలే (29), రెహాన్ అహ్మద్ (9) ఉన్నారు.

అశ్విన్‌ బౌలింగ్‌లో ఇంగ్లాండ్ ఓపెనర్‌ బెన్‌ డకెట్ (28) ఔట్‌ అయ్యాడు. ఇంగ్లాండ్ 332 పరుగులు వెనకబడి ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 17, గిల్ 104, శ్రేయస్ అయ్యర్ 29, అక్షర్ 45, అశ్విన్ 29 పరుగులు చేశారు.

మిగతా బ్యాటర్లు చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. ఇంగ్లాండ్ బౌలర్లలో రెండో ఇన్నింగ్స్‌లో టామ్ హార్ట్‌లీ 4, రెహాన్ అహ్మద్ 3, జేమ్స్ ఆండర్సన్ 2, షోయబ్ బషీర్ 1 వికెట్ తీశారు.

రికార్డులు బద్దలు కొట్టిన బుమ్రా.. దీన్ని అధిగమించడానికి ఇక ఎన్ని దశాబ్దాలు పడుతుందో..