IND vs ENG 2nd Test : ముగిసిన తొలి రోజు ఆట‌

విశాఖ టెస్టులో మొద‌టి రోజు ఆట ముగిసింది

IND vs ENG 2nd Test : ముగిసిన తొలి రోజు ఆట‌

IND vs ENG 2nd Test day 1

Updated On : February 2, 2024 / 4:55 PM IST

తొలి రోజు భార‌త్‌దే
విశాఖ‌లో తొలి రోజు ఆట ముగిసింది. ఆరు వికెట్ల న‌ష్టానిక భార‌త్ 336 ప‌రుగులు చేసింది. య‌శ‌స్వి జైస్వాల్ (179) డ‌బుల్ సెంచ‌రీకి చేరువ అయ్యాడు. అత‌డితో పాటు ర‌విచంద్ర‌న్ అశ్విన్ (5) లు క్రీజులో ఉన్నాడు.


శ్రీఖ‌ర్ భ‌ర‌త్ ఔట్‌.. 
టీమ్ఇండియా మ‌రో వికెట్ కోల్పోయింది. రెహాన్ అహ్మ‌ద్ బౌలింగ్ బ‌షీర్ క్యాచ్ అందుకోవ‌డంతో కేఎస్ భ‌ర‌త్ (17) ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 90.6వ ఓవ‌ర్‌లో 330 ప‌రుగుల వ‌ద్ద ఆరో వికెట్ కోల్పోయింది.

అక్ష‌ర్ ప‌టేల్ ఔట్‌.. 
షోయ‌బ్ బ‌షీర్ బౌలింగ్‌లో రెహాన్ అహ్మ‌ద్ క్యాచ్ అందుకోవ‌డంతో అక్ష‌ర్ ప‌టేల్ (27) ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 85.3వ ఓవ‌ర్‌లో 301 ప‌రుగుల వ‌ద్ద ఐదో వికెట్ కోల్పోయింది.

జైస్వాల్ 150
జో రూట్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టిన య‌శ‌స్వి జైస్వాల్ 224 బంతుల్లో 16 ఫోర్లు, నాలుగు సిక్స‌ర్లు బాది 150 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 77 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 272/4. జైస్వాల్ (151), అక్ష‌ర్ ప‌టేల్ (13) లు ఆడుతున్నారు.

పాటిదార్ క్లీన్‌బౌల్డ్‌..
భార‌త్ మ‌రో వికెట్ కోల్పోయింది. అరంగ్రేట ఆట‌గాడు ర‌జ‌త్ పాటిదార్ (32) రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో భార‌త్ 71.1వ ఓవ‌ర్‌లో 249 ప‌రుగుల వ‌ద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.

టీ బ్రేక్‌..
రెండో టెస్టులో రెండు సెష‌న్లు ముగిశాయి. మూడు వికెట్లు కోల్పోయిన భార‌త్ 225 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ (125), అరంగ్రేట ఆట‌గాడు ర‌జ‌త్ పాటిదార్ (25)లు క్రీజులో ఉన్నారు.

శ్రేయ‌స్ అయ్య‌ర్ ఔట్‌..
టీమ్ఇండియా మ‌రో వికెట్ కోల్పోయింది. టామ్ హార్ట్లీ బౌలింగ్‌లో బెన్‌ఫోక్స్ క్యాచ్ అందుకోవ‌డంతో శ్రేయ‌స్ అయ్య‌ర్ (27) ఔట్ అయ్యాడు. దీంతో 50.4వ ఓవ‌ర్‌లో 179 ప‌రుగుల వ‌ద్ద భార‌త్ మూడో వికెట్ కోల్పోయింది.

సిక్స్‌తో జైస్వాల్ సెంచ‌రీ
ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ అద‌ర‌గొడుతున్నాడు. విశాఖ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ‌త‌కం చేశాడు. టామ్ హార్ట్లీ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. 151 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స‌ర్లు బాది మూడు అంకెల స్కోర్లు అందుకున్నాడు. కాగా.. టెస్టుల్లో స్వ‌దేశంలో జైస్వాల్‌కు ఇదే తొలి టెస్టు సెంచ‌రీ కావ‌డం విశేషం.

లంచ్ బ్రేక్..
రెండో టెస్టు మ్యాచ్‌లో మొద‌టి సెష‌న్ ముగిసింది. లంచ్ బ్రేక్ స‌మ‌యానికి భార‌త్ రెండు వికెట్లు కోల్పోయి 103 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ (51), శ్రేయ‌స్ అయ్య‌ర్‌ (4)లు ఆడుతున్నారు.

య‌శ‌స్వి జైస్వాల్ హాఫ్ సెంచ‌రీ
టీమ్ ఇండియా యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ హాఫ్ సెంచ‌రీ సాధించాడు. బ‌షీర్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి 89 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో అర్ధ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు.

శుభ్‌మ‌న్ గిల్ ఔట్
భార‌త్ మ‌రో వికెట్ కోల్పోయింది. అండ‌ర్స‌న్ బౌలింగ్‌లో ఫోక్స్ క్యాచ్ అందుకోవ‌డంతో శుభ్‌మ‌న్ గిల్ (34) ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 28.5వ ఓవ‌ర్‌లో 89 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది.

రోహిత్ శ‌ర్మ ఔట్‌
భార‌త జ‌ట్టుకు ఎదురుదెబ్బ త‌గిలింది. షోయబ్ బషీర్ బౌలింగ్‌లో ఓలీ పోప్ క్యాచ్ అందుకోవ‌డంతో రోహిత్ శ‌ర్మ (14) ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 17.3వ ఓవ‌ర్‌లో 40 ప‌రుగుల వ‌ద్ద మొద‌టి వికెట్ కోల్పోయింది.

10 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 23/0
టాస్ గెలిచిన భార‌త్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ, య‌శ‌స్వి జైస్వాల్ లు నిల‌క‌డ‌గా ఆడుతున్నారు. 10 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 23/0. రోహిత్ (10), జైస్వాల్ (13) లు ఆడుతున్నారు.

ఇంగ్లాండ్ తుది జట్టు : జాక్‌ క్రాలే, బెన్‌ డకెట్‌, పోప్‌, జో రూట్‌, బెయిర్‌స్టో, బెన్‌స్టోక్స్ (కెప్టెన్‌), బెన్‌ఫోక్స్ (వికెట్‌ కీపర్‌), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ అండర్సన్


టీమ్ఇండియా తుది జ‌ట్టు : రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, రజత్‌ పటీదార్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎస్‌ భరత్ (వికెట్‌ కీపర్‌), ర‌విచంద్ర‌న్ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, జ‌స్‌ప్రీత్ బుమ్రా, ముకేశ్‌ కుమార్‌, కుల్‌దీప్‌ యాదవ్‌


IND vs ENG 2nd Test : విశాఖ వేదిక‌గా జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచులో టీమ్ఇండియా టాస్ గెలిచింది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా ర‌జ‌త్ పాటిదార్ టెస్టుల్లో అరంగ్రేటం చేయ‌నున్నాడు. స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌కు అవ‌కాశం ద‌క్క‌లేదు.