Ind Vs SA : నిప్పులు చెరిగిన శార్దూల్ ఠాకూర్.. సౌతాఫ్రికా 229 ఆలౌట్
టీమిండియా బౌలర్లలో ముఖ్యంగా పేసర్ శార్దూల్ ఠాకూర్ నిప్పులు చెరిగాడు. దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించాడు. కెరీర్ లోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు.

India Vs South Africa Shardul Thakur
Ind Vs SA : జోహాన్నెస్ బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికా, భారత్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. భారత బౌలర్లు విజృంభించారు. దీంతో ఆతిథ్య దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 229 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ పై కేవలం 27 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది సౌతాఫ్రికా.
టీమిండియా బౌలర్లలో ముఖ్యంగా పేసర్ శార్దూల్ ఠాకూర్ నిప్పులు చెరిగాడు. దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించాడు. కెరీర్ లోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. 61 పరుగులు ఇచ్చిన శార్దూల్.. ఏకంగా 7 వికెట్లు తీయడం విశేషం. దక్షిణాఫ్రికాపై ఓ భారత బౌలర్ నమోదు చేసిన అత్యుత్తమ ప్రదర్శన కూడా ఇదే. ఇక షమీ 2 వికెట్లు తీయగా, బుమ్రా 1 వికెట్ తీశాడు.
Pani Puri : స్ట్రీట్ ఫుడ్ పానీ పూరీ ఆరోగ్యానికి మంచిదేనా?
దక్షిణాఫ్రికా జట్టులో కీగాన్ పీటర్సన్ (62), టెంబా బవుమా (51) హాఫ్ సెంచరీలతో రాణించారు. కెప్టెన్ డీన్ ఎల్గార్ (28) వికెట్ కీపర్ వెర్రీన్ (21), మార్కో జాన్సెన్ (21), కేశవ్ మహరాజ్ (21) పరుగులు చేశారు.
ఓవర్‌నైట్ 35/1 స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా వికెట్లు పడగొట్టేందుకు భారత బౌలర్లు శ్రమించారు. కెప్టెన్ డీన్ ఎల్గర్, పీటర్సెన్ కలిసి కొరకరాని కొయ్యలా మారారు. అయితే శార్దూల్ ఠాకూర్ (7/61) తొలి సెషన్ చివరిలో స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు తీసి భారత్‌ను రేసులోకి తీసుకొచ్చాడు.
లంచ్ తర్వాత బవుమా, కైల్ జంట హాఫ్ సెంచరీ (58) భాగస్వామ్యం నిర్మించి ప్రమాకదకరంగా మారారు. మరోసారి ఠాకూర్ విజృంభించి బవుమా, కైల్‌ను ఔట్ చేశాడు. కేశవ్ మహరాజ్ ధాటిగా ఆడుతూ దక్షిణాఫ్రికా స్కోరును రెండు వందలు దాటించాడు.
Dangerous Alexa: 10 ఏళ్ల చిన్నారిని కరెంటు ప్లగ్‌లో వేలు పెట్టమన్న “అలెక్సా”
అంతేకాకుండా ఆధిక్యం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. రబాడ (0)ను షమీ ఔట్ చేయగా.. మహరాజ్‌ను బుమ్రా పెవిలియన్‌కు పంపాడు. జాన్‌సెన్ కూడా కాసేపు భారత బౌలర్లకు చికాకు తెప్పించాడు. అయితే ఠాకూర్ బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు యత్నించి అశ్విన్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత ఎంగిడి కూడా పెవిలియన్‌కు చేరడంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 24 పరుగుల దగ్గర తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (8) జాన్ సెన్ బౌలింగ్ లో ఔటయ్యాడు.