సెంచరీ కొట్టిన రోహిత్‌.. డీఆర్ఎస్ కాపాడిందిలా

సెంచరీ కొట్టిన రోహిత్‌.. డీఆర్ఎస్ కాపాడిందిలా

Updated On : October 19, 2019 / 8:13 AM IST

దక్షిణాఫ్రికాతో టీమిండియా ఆడుతోన్న మూడో టెస్టులో రోహిత్ మరోసారి  చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో టాపార్డర్ విఫలమవుతోన్న వేళ.. రహానెతో కలిసి పరుగుల వరద పారించాడు. 130 బంతుల్లో సెంచరీ కొట్టేసి అరుదైన సెంచరీని నమోదు చేశాడు. ఆరంభంలోనే రోహిత్ అవుట్ అని ప్రకటించిన అంపైర్ నిర్ణయం నుంచి సెంచరీ చేయడం విశేషం. 

తొలి ఇన్నింగ్స్ 10 ఓవర్లకే రెండు వికెట్లు పడిపోయాయి. పదకొండో ఓవర్ తొలిబంతికే రోహిత్ కూడా అవుట్‌ అంటూ సౌతాఫ్రికా ప్లేయర్లు హడావిడి చేశారు. ఈ సమయంలో డీఆర్ఎస్ వాడిన రోహిత్‌కు లైఫ్ వచ్చింది. సౌతాఫ్రికా స్పిన్నర్ రబాడ మ్యాచ్‌లో 6వ ఓవర్ బౌలింగ్ చేస్తున్నాడు. క్రీజులో కోహ్లీ, రోహిత్‌లు ఉండగా స్ట్రైకింగ్ ఎండ్‌లో రోహిత్ వచ్చాడు. 

బంతిని అటెంప్ట్ చేసిన రోహిత్‌కు మోకాలికి బంతి తగిలిందని అవుట్ అప్పీల్ చేయడంతో ఫీల్డ్ అంపైర్ అవుట్ ప్రకటించాడు. బ్యాట్ ఎడ్జ్ కు తాకిన తర్వాతే కాలికి తగిలిందనే కాన్ఫిడెంట్‌తో రోహిత్ సెకన్ల వ్యవధిలో రివ్యూకు వెళ్లాడు. సక్సెస్‌ఫుల్‌గా రివ్యూ ముగించుకుని నాటౌట్‌గా నిలిచాడు.