రాహుల్‌కి చోటుందా : సౌతాఫ్రికా టీ20 సిరీస్..టెస్టు జట్టు ఎంపిక

వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా..దక్షిణాఫ్రికాతో తలపడబోతోంది. ఈ సిరీస్ కోసం జట్టును ఎంపిక చేయనున్నారు. ఫుల్ ఫామ్‌లో ఉన్న క్రీడాకారులను మార్చాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. కానీ..కొన్ని వ్యక్తిగత ప్రదర్శనల వల్ల టీమ్ మేనేజ్ మెంట్ అసంతృప్తిగా ఉన్నట్లు టాక్. సొంతగడ్డపై..కుర్రాళ్లకు ఛాన్స్ ఉందని తెలుస్తోంది. దీంతో సౌతాఫ్రికాతో సిరీస్‌కు భారత జట్టు ఎంపిక కీలకంగా మారింది. సీనియర్ ఫాస్టు బౌలర్లు బుమ్రా, మహ్మద్ షమీ, భువనేశ్వర్‌లకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సెప్టెంబర్ 12వ తేదీ గురువారం 15 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించనుంది. అందరి చూపు కే ఎల్ రాహుల్ పైనే ఉంది. రోహిత్ శర్మను ఓపనర్‌గా ప్రకటించవచ్చనే అవకాశం ఉంది. రాహుల్‌ని ఎంపిక చేస్తారా ? లేదా అన్న సందేహాలు కూడా ఉన్నాయి. ఓపెనింగ్ స్థానం కోసం శుభ్ మన్ గిల్, ప్రియాంక్ పంచల్ పోటీ పడుతున్నారు. రాహుల్‌ని తప్పిస్తే..భారత్ ఏ తరపున ఆడుతున్న బెంగాల్ ఓపెనర్ అభిమన్యు ఓపెనర్‌గా ఎంపిక కావచ్చని తెలుస్తోంది. విండీస్ పర్యటనలో లేని..ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా ఎంట్రీ ఇస్తున్నారు. పేస్ బౌలర్ షమికి రెస్టు ఇస్తే..ఉమేవ్ యాదవ్‌కు అవకాశం లభిస్తుంది.
టెస్టు సిరీస్ జట్టు అంచనా : మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ, పుజారా, కోహ్లీ, రహానే, హనుమ విహారి, హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్, సాహా, బుమ్రా, ఇషాంత్ షమి / ఉమేశ్ యాదవ్, అశ్విన్, జడేజా, కుల్ దీప్.
సెప్టెంబర్ 15 : తొలి టీ 20 ధర్మశాల
సెప్టెంబర్ 18 : రెండో టీ 20 మొహాలి
సెప్టెంబర్ 22 : మూడో టీ 20 బెంగళూరు
అక్టోబర్ 2 -6 తొలి టెస్టు విశాఖపట్టణం
అక్టోబర్ 10 – 14 రెండో టెస్టు ఫుణె
అక్టోబర్ 19 – 23 మూడో టెస్టు రాంచి