PM Modi : సరైన మార్గంలో వెళుతున్నాం.. ఇంతకన్నా ఎక్కువ సాధిస్తాం
భారత అథ్లెట్లు మరింత ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు అన్ని విధాలుగా సహాయపడతామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.

PM Modi Interacting with athletes
PM Modi : భారత అథ్లెట్లు మరింత ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు అన్ని విధాలుగా సహాయపడతామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. రానున్న ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు మరింత మెరుగైన ప్రదర్శన చేస్తారనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. మంగళవారం న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో ఆసియా క్రీడలు 2023లో పాల్గొన్న భారత అథ్లెట్ల బృందాన్ని ప్రధాని సత్కరించారు.
అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. ఆసియా గేమ్స్‌లో భారత్ సాధించిన పతకాలు దేశ విజయానికి నిదర్శనం అని అన్నారు. సరైన మార్గంలోనే ముందుకు వెలుతున్నామని ఆనందం వ్యక్తం చేశారు. అథ్లెట్లకు ప్రభుత్వం అన్ని విధాలుగా సాయం చేస్తుందన్నారు. ఈ సారి 100 కు పైగా పతకాలు తీసుకువచ్చారు. వచ్చేసారి ఇంతకన్నా ఎక్కువ పతకాలను తీసుకురావాలని సూచించారు. పారిస్ ఒలింపిక్స్‌లో అథ్లెట్లు తమ అత్యుత్తమ ప్రదర్శన చేయాలన్నారు.
భారతదేశంలో ఎప్పుడూ ప్రతిభకు కొరత లేదని, గెలవాలనే సంకల్పం ఎప్పుడూ ఉండేదన్నారు. ఇంతకు ముందు కూడా మన అథ్లెట్లు బాగా రాణించేవారని, పతకాలు గెలచేవారని చెప్పారు. అయితే.. వారి మార్గంలో చాలా అడ్డంకులు ఎదురయ్యేవని చెప్పారు. కాగా.. 2014 తరువాత నుంచి అథ్లెట్లకు మంచి శిక్షణ సదుపాయాలు అందుతున్నాయని ప్రధాని మోదీ చెప్పారు. రానున్న ఐదు సంవత్సరాల కాలంలో అథ్లెట్ల కోసం, మౌళిక సదుపాయాల కోసం రూ.3వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.
Glimpses from the very special meeting with our Asian Games contingent, their coaches and support staff.
The unwavering spirit, dedication and the countless hours of hard work of every athlete is inspiring.
The accomplishments of our athletes have not just added to India’s… pic.twitter.com/L9edaCS4tA
— Narendra Modi (@narendramodi) October 10, 2023
ఇటీవల చైనా వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో భారత బృందం 107 పతకాలు సాధించింది. ఇందులో 28 స్వర్ణ పతకాలు ఉన్నాయి.