తొలి 5 ఓవర్లలోనే ధావన్ వికెట్ ఫట్

తొలి 5 ఓవర్లలోనే ధావన్ వికెట్ ఫట్

Updated On : March 13, 2019 / 12:37 PM IST

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరుగుతోన్న ఐదో వన్డేలో భారత్ ముందు 273 పరుగుల టార్గెట్ ఉంచింది ఆస్ట్రేలియా. సిరీస్ లో ఆఖరిదైన వన్డేలో విజయం సాధించాలని ఇరు జట్లు తహతహలాడుతున్నాయి. ఈ క్రమంలో చేధనకు దిగిన భారత్.. 4.2 ఓవర్లకే తొలి వికెట్ కోల్పోయింది. నాల్గో వన్డేలో సెంచరీకి మించిన స్కోరుతో అలరించిన ధావన్(12) పరుగులకే క్యారీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

చేధనకు ఇంకా చాలా దూరం ఉండటంతో కెప్టెన్ కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగాడు. క్రీజులో కోహ్లీ(4), రోహిత్ శర్మ(3)పరుగులతో ఉన్నారు.
Read Also : ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు గురించి తెలుసుకోవలసినవి