IND vs AUS: భారీ భద్రత మధ్య వైజాగ్‌ స్టేడియం

IND vs AUS: భారీ భద్రత మధ్య వైజాగ్‌ స్టేడియం

Updated On : February 23, 2019 / 1:12 PM IST

పుల్వామా ఉగ్రదాడి ఫలితంగా భారత్ ఏ ఈవెంట్ చేయాలన్నా మునుపటి కంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే భారత్.. పాక్ జట్టుతో తలపడొద్దంటూ పలు చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఉగ్రవాదులు మరోసారి తెగబడతారేమోనన్న అనుమానంతో వైజాగ్‌లో భారీ భద్రతా చర్యలు తీసుకున్నారు. ఈ మేర నగరమంతటా గట్టి బందోబస్తు చర్యలు చేపట్టినట్లు కమిషనర్ మహేశ్ చంద్ర తెలిపారు. 

‘ఆదివారం సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30 గంటల వరకూ మాత్రమే స్టేడియం లోపలికి అనుమతిస్తాం. మ్యాచ్ చూడడానికి వచ్చే వాళ్లు ఫ్లకార్డ్స్ మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతిస్తాం. హెల్మెట్, లగేజ్ బ్యాగ్, స్టిక్స్ లాంటి వస్తువులు ఏమైనా స్టేడియం బయటే వదిలేయాలి. ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ఉండాలని వాహనాల్ని బీచ్‌రోడ్‌వైపు మళ్లిస్తున్నాం’ అని వివరించారు. 

ఈ మ్యాచ్ కోసం ధోనీ మూడు రోజుల ముందుగానే వైజాగ్ చేరుకోగా అభిమానులంతా కలిసి ఘన స్వాగతం పలికారు. అయితే ఇప్పటికే టీమిండియా మొత్తం విశాఖపట్టణం స్టేడియానికి చేరుకుని నెట్స్ లో తీవ్రంగా ప్రాక్టీసు చేసింది. క్రికెటర్లు ప్రాక్టీసు చేస్తున్న ఫొటోలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్టు చేసింది.